ఫ్రీ కాదమ్మా : ఎమ్మెల్యే టికెట్ దరఖాస్తుకు రూ.50 వేలు కట్టాలి..

ఫ్రీ కాదమ్మా : ఎమ్మెల్యే టికెట్ దరఖాస్తుకు రూ.50 వేలు కట్టాలి..

తెలంగాణలో  త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులు అనుకుంటూ ఉంటారు. పేరున్న పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి..ప్రయత్నించి విఫలమవుతారు. అయితే ఇలాంటి వారి కోసం కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. ఇందుకు కొన్ని కండీషన్లు పెట్టింది..అవి ఏంటో తెలుసుకుందాం..
  
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్  నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్ కోసం  దరఖాస్తు చేసుకునే వెసులుబాటును తెలంగాణ కాంగ్రెస్ కల్పించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  ఆగస్టు 18 నుంచి 25 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. ఓసీ అభ్యర్థులైతే రూ.50 వేలు, బీసీలైతే రూ.25 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు రుసుము లేదని తెలిపింది.

ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంత మంది అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికే  టిక్కెట్ల కేటాయింపు ఉంటుందట. ముందుగా దరఖాస్తులను  పరిశీలించి టికెట్లను కేటాయిస్తారని తెలుస్తోంది. ఆగస్టు 25 వరకు వచ్చిన అప్లికేషన్లకు... కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో స్క్రీనింగ్ నిర్వహిస్తారు. మరోవైపు రాష్ట్రంలో ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధిష్టానం బలమైన నమ్మకంతో ఉంది. దీంతో  కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం ఆశావహుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది.  ఫీజులు పెట్టడం వల్ల ఆ ఒత్తిడి తగ్గదు కానీ.. పార్టీకి మాత్రం కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది.