హైదరాబాద్: పీసీసీ మీడియా కమిటీని ప్రకటించి 24 గంటలు తిరగకముందే.. దాన్ని హోల్డ్ పెడుతున్నట్టు ప్రకటించడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం మధ్యాహ్నం కమిటీ చైర్మన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 50 మందితో ‘పీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ కమిటీ’ని విడుదల చేశారు.
.అయితే, మంగళవారం పీసీసీ తన ఎక్స్ ఖాతాలో ఈ కమిటీ నియామకాన్ని హోల్డ్ లో పెడుతున్నట్టు పోస్ట్ చేయడంతో పార్టీ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యాయి. జాతీయ మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా ఆమోదం లేకుండానే దీనిని ప్రకటించారని, ఆయన ఆదేశాల మేరకే పీసీసీ కమిటీని నిలిపివేసిందని కొందరు నేతలు చెబుతున్నారు. మరోవైపు కమిటీలోని కొన్ని పేర్లను సవరించకుండా పాత లిస్టునే రిలీజ్ చేయడం వల్లే హోల్డ్ లో పెట్టారనే ప్రచారం కూడా పార్టీలో జరుగుతోంది.
