కొత్త పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ వైభవం

కొత్త పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ వైభవం

న్యూఢిల్లీ, వెలుగు : నూతన పార్లమెంట్ భవనంలో తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక స్థానం కల్పించారు. రాష్ట్ర పండుగ బతుకమ్మ, రామప్ప ఆలయం, ప్రత్యేక జానపద నృత్యాలు, కళలు, పెయింటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. దేశంలోని కట్టు, బొట్టు, కళలు, ప్రత్యేకతలను ఒకే చోటుకు చేర్చే లక్ష్యంతో పార్లమెంట్ మధ్య భాగంలో కానిస్టిట్యూషన్ గ్యాలరీని ఏర్పాటు చేశారు. త్రిభుజాకారంలో ఉన్న పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రముఖ ద్వారం(ఎంపీలు వెళ్లే మెయిన్ గేట్) మకర ద్వారం నుంచి ఎంట్రీ కాగానే ఎడమ వైపు లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ, కుడి వైపు రాజ్యసభ ఉంటుంది.

వీటికి మధ్యలో త్రిభూజాకార డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ గ్యాలరీ దర్శనమిస్తుంది. ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో దేశంలోని అన్ని సంస్కృతులను ఒక చోటుకి చేర్చారు. ఇందులో భాగంగా సంగీత దీర్ఘ (నృత్యాలు, సంగీత వాయిద్యాలు), శిల్ప దీర్ఘ(శిల్పాలు), సపత్య దీర్ఘ(వారసత్వ కట్టడాలు, ఆలయాలు), జన్ – జనని– జన్మభూమి(దేశంలోని ప్రత్యేక పెయింటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు), వసుధైక కుటుంబం, లియో ఫుకో పెండ్యూలం (సాంకేతికత), మంథన్ (క్షీర సాగర మథనం) వంటి విభాగాలను ఏర్పాటు చేశారు. 

‘సంగీత దీర్ఘ’ విభాగంలో బతుకమ్మ ఔనత్యం..

దేశంలోని ప్రతి రాష్ట్రానికి సంబంధించిన జానపద కళలు, సంగీత వాయిద్యాలు, నృత్య కళలు వంటి వాటిని ‘సంగీత దీర్ఘ’విభాగంలో చూడవచ్చు. ఇందులోనే తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ విశేషాలను పెట్టారు. ఒగ్గు కథ, డప్పు డ్యాన్స్, పేరిణి శివ తాండవం, థీమ్సా, లంబాడీ, గుస్సాడీ నృత్యాలు పొందుపర్చారు. వీటితో పాటు దేశంలోని సంగీత విద్వాంసులు వాడిన వాయిద్యాలను ఏర్పాటు చేశారు.

సపత్య దీర్ఘలో విభాగంలో

దేశంలోని ప్రత్యేక వారసత్వ కట్టడాలు, ఆలయాలను చూడవచ్చు. ఇందులోనే తెలంగాణకు చెందిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప (రుద్రేశ్వర) ఆలయ చిత్ర పటాన్ని చూడవచ్చు. ఏపీ నుంచి లేపాక్షి (మహానంది), ఇతర ఆలయ చిత్రాలు ఉన్నాయి. తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్, ఉదయగిరి గుహలు, వీరుపాక్ష టెంపుల్, కోల్ కతా మహంకాళి టెంపుల్, కోనార్క్ (సూర్య) టెంపుల్, గుజరాత్​లోని ఆలయాలు, అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ కట్టడాలను ఏర్పాటు చేశారు. జన్ –-జనని –-జన్మభూమి( పీపుల్ వాల్) విభాగంలో వాల్ పెయింటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ చేర్యాల స్కోల్ పెయింటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్థానం దక్కింది. తెలంగాణకు చెందిన చేర్యాల పెయింటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పసుల మంగ, పసుల మల్లేశంలు వేశారు.

భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటింది అనే ఇతివృత్తంలో ‘వసుధైక కుటుంబం’గ్యాలరీ ప్రతిబింబిస్తోంది. వేదకాలం, ఇతిహాసాలు (రామాయణం, మహాభారతం), గ్రామ రాజ్యా (జనపద్), బుద్ధ -బౌద్ధ పిరియడ్, అశోక పాలన కాలం, భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాణిజ్య అభివృద్ధి, శివాజీ- ఇతర రాజుల కాలంలో పాలన తీరు, నార్త్ ఈస్ట్ అభివృద్ధి, భారతదేశ యూనిటీ, విదేశీ మేధావులు దేశ అభివృద్ధి గురించి వర్ణించిన తీరు, దేశ ఏర్పాటు, ఓటింగ్ ప్రక్రియ గురించి చిత్రాలు, బొమ్మలతో సహా చూడొచ్చు. 

క్షీర సాగర మథనం(మంథన్)..

మంథన్ పేరుతో క్షీర సాగర మథనం జరిగిన తీరును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కంబోడియాలోని అంగ్కోర్ వాట్ దేవాలయం నుంచి ఈ చిత్రం ప్రేరణ పొందింది. మంథన్ అంటే మథనం, మంధర పర్వతాన్ని చిలికే పక్రియ. ‘ఉర్వారుకమివ బంధనన్ మృత్యోర్ముక్షీయ మమృతాత్’అనేది ఇక్కడి నుంచే ఉద్భవించింది. ప్రెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ ‘లియో ఫుకో’ 1851లో రూపొందించిన పెండ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ గ్యాలరీ మధ్య భాగంలో ఏర్పాటు చేశారు.