ఎన్ఆర్సీపై తెలంగాణ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

ఎన్ఆర్సీపై తెలంగాణ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఎన్ఆర్సీ అమలుచేయమంటూ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. NRC, CABలపై నెలరోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాలు వాటిని వ్యతిరేకిస్తూ తమ వైఖరిని స్పష్టం చేశాయి. ఇప్పుడు తెలంగాణ కూడా ఆ జాబితాలోకి చేరినట్లే కనిపిస్తోంది. తెలంగాణలో NRCని ఎట్టి పరిస్థితుల్లో అమలుచేయబోమని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజలెవరూ NRC గురించి భయపడవద్దని ఆయన ప్రజలకు ధైర్యాన్నిచ్చారు. NRC, CABలపై ఇప్పటివరకూ సీఎం కేసీఆర్ ఎక్కడా ప్రస్తావించలేదు. కేటీఆర్ మాత్రం తాము ఆ చట్టాలకు వ్యతిరేకమని చెబుతూ వస్తున్నారు.

‘డిప్యూటీ సీఎంగా నేను మీకు మాట ఇస్తున్నాను.. ఎన్‌ఆర్సీ గురించి మరచిపోండి, రాష్ట్రంలో ఎలాంటి అవాంతరాలు జరగవు’ అని ఆయన ఒక మీటింగ్‌లో పాల్గొన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడ హింసను ఎదుర్కొన్నా.. వారందరికీ ఆశ్రయం ఇవ్వాలి ఎందుకంటే ఇది భారతదేశం. అయితే, పౌరసత్వం పేరుతో దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న వారికి ఇబ్బంది కలిగించొద్దు. ఎప్పటినుంచో ఉంటున్నవారు బర్త్ సర్టిఫికెట్లు తమ దగ్గర ఉంచుకుంటారా?’ అని ఆయన అన్నారు.

పార్లమెంటులో CAB బిల్లు పెట్టినప్పుడు టీఆర్ఎస్ ఓటింగ్‌కి దూరంగా ఉందని ఆయన గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే పౌరసత్వ చట్టానికి తాము వ్యతిరేకమని ప్రకటించారని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడ హింసను ఎదుర్కొన్నా.. వారందరికి భారతదేశంలో ఆశ్రయం కల్పించాలని మహమూద్ అలీ అన్నారు. గత వారం కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి కలిసినప్పుడు కూడా తాను ఈ విషయాన్ని ఆయనకు తెలియజేశానని మహమూద్ అలీ తెలిపారు.

For More News..

బాత్రూంలో ఉన్న ఫొటోలతో మాజీ మిస్ ఇండియాకు వేధింపులు

మరో ఏడాదిలో ఏపీ సీఎంగా వైఎస్ భారతి!