స్లీపర్ సెల్స్‌‌‌ను గుర్తిస్తున్నాం : డీజీపీ

స్లీపర్ సెల్స్‌‌‌ను గుర్తిస్తున్నాం : డీజీపీ
  • మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది: డీజీపీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న స్లీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రత్యేకంగా నిఘా పెట్టామని డీజీపీ జితేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. స్లీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన వారిని గుర్తించి కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితులపై శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రత ఉందని, టెర్రరిస్టుల కార్యకలాపాలను ఆదిలోనే తెలంగాణ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనిట్లు కనిపెట్టాయన్నారు. 

గ్రూపులుగా ఏర్పడుతున్న టెర్రరిస్టులు సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. దేశ సరిహద్దు‍ల్లో ఇటీవల ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీయులను తిరిగి పంపడంపై డీజీపీ ఈ మేరకు స్పందించారు. మరోవైపు, మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో గతేడాది 300 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల వద్ద లొంగిపోయారని, మరో 25 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు.