పోలింగ్ ప్రశాంతం..పోలీస్ సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి అభినందనలు 

పోలింగ్ ప్రశాంతం..పోలీస్ సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి అభినందనలు 

హైదరాబాద్‌‌, వెలుగు: ఏడు మున్సిపల్ కార్పొ రేషన్లు, 116 మున్సిపాలిటీల్లో బుధవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. స్వల్ప ఘటనలు మిన హా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. ఈ మేరకు పోలింగ్ ప్రక్రియను లా అండ్ ఆర్డర్‌‌‌‌ అడిషనల్ డీజీ మహేశ్‌‌భగవత్​తో కలిసి డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పోలింగ్ సరళిని సమీక్షించారు.

ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్‌‌ను వెబ్‌‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు జారీ చేశారు. కెమెరాల నిఘా, పోలీస్ సిబ్బంది బందోబస్తు వల్ల శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. వృద్ధ ఓటర్లను, దివ్యాంగులను ఓటర్ల పిల్లలను శ్రద్ధగా చూసుకున్న పోలీస్ సిబ్బందిని డీజీపీ అభినందించారు.