ప్రాణం పోయినా సిద్ధాంతాన్ని వీడను

ప్రాణం పోయినా సిద్ధాంతాన్ని వీడను

చేవెళ్ల, వెలుగు:   ప్రాణం పోయినా నమ్మిన సిద్దాంతాన్ని విడిచిపెట్టనని చేవెళ్ల సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీం భరత్ తెలిపారు. శుక్రవారం సెగ్మెంట్ పరిధిలోని షాబాద్ మండలం  బొబ్బిలి గామ, ఊబగుంట, కొమరబండ, గొల్లూరు గూడ, కేశగూడ, కుమ్మరి గూడ, మల్లారెడ్డి గూడ  గ్రామాల్లో గడపగడపకు   తిరుగుతూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

భీం భరత్ మాట్లాడుతూ..  ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్​రెడ్డి హయాంలో టీటీడీ బోర్డులో మెంబర్​గా పనిచేసిన కాలె యాదయ్య .. టికెట్లు, లడ్డూలు దొంగతనంగా అమ్ముకున్నాడని ఆయన ఆరోపించారు. అలాంటి దొంగ ఇప్పుడు ప్రచారం కోసం ఏ గ్రామానికి వెళ్లినా జనం నిలదీసి ప్రశ్నిస్తుంటే.. మోహం చూపలేక పారిపోతున్నాడన్నారు.  ఈ నెల 30 జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని భీం భరత్ కోరారు.