15న రిలీజ్ : 58 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్

15న రిలీజ్ : 58 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్దమైంది. అక్టోబర్ 15వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. 54 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించనుంది. తెలంగాణతో పాటు..మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటించున్నట్లు తెలుస్తోంది. 

అక్టోబర్ 15వ తేదీన 54 స్థానాలకు తొలి జాబితా ప్రకటించనున్న కాంగ్రెస్..మరో  రెండు రోజుల్లో మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది. ప్రస్తుతం సీపీఎం, సీపీఐతో పొత్తులపై చర్చలు తుది దశలో ఉన్నాయి. ఈ పొత్తులపై అక్టోబర్ 15వ తేదీ కల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

గెలుపు అవకాశాలు, పార్టీకి విధేయులుగా ఉన్న వారినే అభ్యర్థులుగా ఎంపిక చేశామని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు మురళీధరన్ తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు. 119 స్థానాల్లో మెజారిటీ పార్టీ నేతలకు సీట్లను కేటాయిస్తామన్నారు. పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లడం అనేది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు.

ALSO READ : జాక్వెలిన్ కోసం సుఖేష్ చంద్రశేఖర్ ఉపవాసం ... తొమ్మిదో రోజు పూజ