
- సెగ్మెంట్స్లో అభ్యుర్థులు ఎవరో
- 25 నియోజక వర్గాలపై ఇప్పటికే క్లారిటీ
- సాయంత్రం పీఈసీ మీటింగ్
- వడాపోసిన తర్వాత స్క్రీనింగ్ కమిటీకి లిస్ట్
- స్క్రీనింగ్ పూర్తయ్యాక ఏఐసీసీకి జాబితా
- తర్వాత ఫైనల్ లిస్ట్ విడుదల
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో ఇవాళ సాయంత్రం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ తరపున 25 సెగ్మెంట్స్ లో పోటీ చేసే వారెవరో క్లారిటీ వచ్చినట్టు సమాచారం. మిగతా 94 చోట్ల అభ్యర్థుల వడపోత కోసం సాయంత్రం పీఈసీ( ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ) ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ లో భేటీ అవుతోంది. 1006 దరఖాస్తులు రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాల కోసం 1006 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొడంగల్, మథిర సెగ్మెంట్స్ లో ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది.. చాలా సెగ్మెంట్స్ లో పోటీ తీవ్రంగా ఉంది.
3 రోజుల పాటు డీసీసీ అధ్యక్షులతో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్.
ప్రదేశ్ ఎలెక్షన్ కమిటీ వడపోసిన జాబితాను స్క్రీనింగ్ కమిటీకి అందిస్తారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, కమిటీ సభ్యులు 3 రోజుల పాటు డీసీసీ అధ్యక్షులు, ఆ జిల్లాకు సంబంధించిన సీనియర్ లీడర్లతో విడివిడిగా చర్చలు జరపనుంది. వారి అభిప్రాయాలను తీసుకొని ఫైనల్ చేసి ఏఐసీసీకి పంపి జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రావడానికి నాలుగైదు రోజుల పైనే పట్టే అవకాశం ఉంది.
ఆశావహుల పైరవీలు
కాంగ్రెస్ టికెట్లకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆశావహులు ఇప్పటికే పైరవీలు ప్రారంభించారు. ఎలాగైనా తమకు టికెట్ దక్కేలా చూడాలని వేడుకుంటున్నారు. ఒక్క చాన్స్ ఇస్తే గెలిచి చూపిస్తామని భరోసా ఇస్తున్నారు. అయితే ఆ 94 సెగ్మెంట్లలో టికెట్ ఎవరిని వరిస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది