1,037 మంది ఔట్ సోర్సింగ్.. పంచాయతీ సెక్రటరీల సేవలు మరో ఏడాది పొడిగింపు

1,037 మంది ఔట్ సోర్సింగ్..  పంచాయతీ సెక్రటరీల సేవలు మరో ఏడాది పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో ఔట్​సోర్సింగ్​విధానంలో పనిచేస్తున్న 1,037 మంది పంచాయతీ సెక్రటరీల సేవలను మరో ఏడాదిపాటు కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి ఔట్‌‌‌‌ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ప్రతినెలా రూ.19,500  చొప్పున జీతం చెల్లిస్తున్నారు. రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు ఈ నియామకాలు కొనసాగుతాయని ఉత్తర్వులో పేర్కొన్నారు. 

రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌సోర్సింగ్ సేవల్లో ఉన్న మొత్తం పంచాయతీ సెక్రటరీల సంఖ్య జిల్లాలోని జీపీల సంఖ్యను మించరాదనే నిబంధనను విధించారు. కాగా, ఔట్​సోర్సింగ్ సెక్రటరీల సేవలను మరో ఏడాదిపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి మధుసూదన్​రెడ్డి, శ్రీనివాస్​ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.