వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి 

వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి 
  • గ్రూప్ 2లో 663, గ్రూప్ 3లో 1,373 ఉద్యోగాలు  

హైదరాబాద్, వెలుగు: 2,910 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో గ్రూప్ 2 పోస్టులు 663, గ్రూప్ 3 పోస్టులు 1,373 ఉన్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్-3 ఉద్యోగాల్లో మొత్తం 99 హెచ్ఓడీలు, వివిధ కేటగిరీల పరిధిలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. గతంలో సీఎం ప్రకటించినప్పుడు గ్రూప్ 2 పోస్టులు 582 ఖాళీగా ఉన్నాయని చెప్పగా, ఇప్పుడా సంఖ్య పెరిగింది. 81 పోస్టులు పెంచి, మొత్తం 663 పోస్టులకు పర్మిషన్ ఇచ్చారు.

ఇక కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ లో 347,  మార్కెటింగ్ లో 12, హార్టికల్చర్ లో 21, రిజిస్ర్టార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీల్లో 99, పశుసంవర్థక శాఖలో 294, గిడ్డంగుల సంస్థలో 50, విత్తన ధ్రువీకరణ సంస్థలో 25 పోస్టులు ఉన్నాయి. కాగా, ఈ పోస్టులతో కలిపి ఇప్పటి వరకు 52,460 పోస్టులకు పర్మిషన్ ఇచ్చినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.