Hyderabad: హైదరాబాద్ హాస్టల్స్లో ఉంటున్నారా..? మీకు ఈ విషయం తెలుసో.. లేదో..!

Hyderabad: హైదరాబాద్ హాస్టల్స్లో ఉంటున్నారా..? మీకు ఈ విషయం తెలుసో.. లేదో..!

హైదరాబాద్ నగరంలోని పలు హాస్టల్స్పై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేశారు. కొన్ని హాస్టల్స్లో నాణ్యత లేని పదార్థాలను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు పాటించని హాస్టల్స్ యాజమాన్యాలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 

గ్రేటర్​హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్టల్స్ ఫుల్ అయిపోతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఐటీ ఎంప్లాయ్స్​ రాక కోసం ఎదురుచూసిన హాస్టళ్లు ఇప్పుడు రష్గా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు, చదువులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్​ కోసం వచ్చి అకామిడేషన్ కోసం హాస్టళ్లలో ఉంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అమీర్‌‌పేట్, దిల్‌ సుఖ్​నగర్, ఎస్సార్ నగర్, మధురానగర్, కూకట్‌పల్లి, మాదాపూర్ వంటి ఏరియాల్లోని కోచింగ్ ఇనిస్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటూ  దగ్గర్లోని పీజీల్లో ఉంటున్నారు. దీంతో కొన్ని నెలలుగా ఈ ప్రాంతాల్లోని హాస్టళ్లు రష్​ కనిపిస్తోంది.

గత డిసెంబర్ నుంచి ఆఫీసుకు వచ్చేయాలని ఉద్యోగులను ఐటీ కంపెనీలు ఆదేశించడంతో ఐటీ కారిడార్‌‌లోని హాస్టల్స్‌ నిండిపోయాయి. ఇప్పటికే ఫిల్ అయిపోయాయి. ఐటీ కారిడార్‌‌లో దాదాపు 2,300ల హాస్టల్స్ ఉన్నాయి. హాస్టళ్లలో సింగిల్ రూమ్ నెలకు రూ.5 నుంచి రూ.6 వేలు ఉండగా, ప్రస్తుతం హాస్టల్ను బట్టి రూ. 8,500 నుంచి రూ.10 వేలు ఉన్నాయి. ముగ్గురు, నలుగురు ఉండే షేరింగ్ రూమ్లు ప్రస్తుతం రూ.6,500 వరకూ వసూలు చేస్తున్నారు. చిక్కడపల్లి, దిల్ సుఖ్ నగర్​ లాంటి ఏరియాల్లో ఖాళీలే ఉండట్లేదు. కొన్ని హాస్టళ్లలో కెపాసిటీని మించి బెడ్స్ అరేంజ్​చేస్తుండగా,  ఇదివరకు ఉండి వెళ్లిన వాళ్లకు కూడా బెడ్స్​ఖాళీగా లేవు.