V6 News

కుటుంబ సర్వేలో గంగాపుత్రను చేర్చాలి..చిన్నా రెడ్డికి వినతి

కుటుంబ సర్వేలో గంగాపుత్రను చేర్చాలి..చిన్నా రెడ్డికి వినతి

పంజాగుట్ట, వెలుగు: తెలంగాణ కుటుంబ సర్వే రిపోర్టులో గంగాపుత్ర కులాన్ని ప్రత్యేకంగా చేర్చాలని తెలంగాణ గంగాపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టంగుటూరి రాజేశ్ ఖన్నా కోరారు. శుక్రవారం బేగంపేటలోని ప్రజాపాలన భవన్​లో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నా రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీకి చెందిన అగ్నికుల క్షత్రియ కులాన్ని సర్వేలోని తమ కుల పట్టిక నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీనివల్ల గంగాపుత్రులకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఇతరులకు మళ్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే రిపోర్టులో తమ కులాన్ని బేస్త లేదా గుండ్లగా నమోదు చేయాలని, తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు