ఎస్టీ ఫండ్స్‌‌ దారి మళ్లిస్తున్న సర్కార్

ఎస్టీ ఫండ్స్‌‌ దారి మళ్లిస్తున్న సర్కార్
  • డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం అందులో నుంచే కేటాయింపు
  • ఎస్సీలకు సంబంధించిన ఫండ్స్‌‌ కూడా వేరే స్కీమ్‌‌లకు ఖర్చు

హైదరాబాద్, వెలుగు: ఎస్టీ స్పెషల్ డెవలప్​మెంట్​ ఫండ్స్‌‌ను రాష్ట్ర సర్కార్‌‌‌‌ దారి మళ్లిస్తోంది. ఏటా ఈ ఫండ్స్ వివిధ స్కీమ్‌‌ల కోసం వినియోగిస్తున్నారు. తాజాగా డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ.1,700 కోట్లు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌‌మెంట్‌‌ స్పెషల్ డెవలప్‌‌మెంట్‌‌ ఫండ్‌‌​ నుంచి హౌసింగ్ శాఖకు మళ్లిస్తున్నారు. ఈ మేరకు హౌసింగ్ సెక్రటరీ నుంచి ట్రైబల్ వెల్ఫేర్ శాఖకు లెటర్ అందింది. తొలి విడతగా రూ.425 కోట్లు సబ్ ప్లాన్ నిధుల్లో నుంచే ఇచ్చినట్లు తెలిసింది. ఇలా ఒక్క డబుల్ బెడ్రూం ఇండ్లకే కాదు.. వివిధ డిపార్ట్‌‌మెంట్లలో అమలవుతున్న అనేక స్కీమ్‌‌లకు ఖర్చయ్యే మొత్తం సబ్ ప్లాన్ నిధుల నుంచే మళ్లిస్తున్నారు.

ఎస్టీ లబ్ధిదారుల పేరిట ప్రభుత్వం తెలివిగా నిధుల మళ్లింపు చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఒక్క ఎస్టీ స్పెషల్ డెవలప్‌‌మెంట్ మాత్రమే కాకుండా.. ఎస్సీలకు సంబంధించి కూడా ఫండ్స్‌‌ను మళ్లించడంలో ఇదే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇలా స్కీమ్‌‌లకు దారి మళ్లిస్తున్న సబ్‌‌ ప్లాన్ నిధులనే.. సబ్ ప్లాన్ ఖర్చులుగా సర్కార్ చూపెడుతోంది. ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు సంబంధించి స్టేట్ లెవల్ కౌన్సిల్, స్టేట్, జిల్లా విజిలెన్స్ కమిటీలు కూడా ప్రభుత్వం వేయడం లేదు.

మిగిలిన ఫండ్స్‌‌ను క్యారీ ఫార్వర్డ్ చేయట్లే

ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవపల్‌‌మెంట్‌‌ ఫండ్ కింద నిధులను వేరే వాటికి ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. మిగిలిన నిధులను క్యారీ ఫార్వర్డ్ కూడా చేయడం లేదు. రాష్ట్రంలో ఎస్సీలు 16%, ఎస్టీలు 9.98% ఉన్నారు. జనాభా ప్రాతిపదికన వీరి కోసం బడ్జెట్‌‌‌‌లో ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీల నిధులను ఉపయోగించకుంటే మిగిలిన వాటిని క్యారీ ఫార్వర్డ్‌‌‌‌ చేయాలి. ఖర్చు చేయకపోతే వచ్చే ఏడాది వాడుకోవాలి. కానీ, ఏనాడూ క్యారీ ఫార్వర్డ్‌‌‌‌ చేయలేదని ఎస్సీ, ఎస్టీ లీడర్లు మండిపడుతున్నారు.

ఈ ఏడాదిలో ఎస్టీ ఎస్డీఎఫ్‌‌కు రూ.13,412 కోట్లు కేటాయించారు. వీటి నుంచి ఇతర శాఖలకు స్కీమ్‌‌ల పేరిట మళ్లుతున్న నిధులే ఎక్కువ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల నిధులను యథేచ్ఛగా దారి మళ్లిస్తున్నారని 2017లో ప్రభుత్వం స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌ ఫండ్‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది. కానీ, ఆ చట్టం లక్ష్యం నెరవేరడం లేదు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌, ఎస్డీఎఫ్‌‌ కింద రూ.1,54,668 కోట్లను కేటాయించారు.  వాటిల్లో 30 శాతం నిధులు వేరే శాఖలకు మళ్లించి ఖర్చు చేసినట్లు తెలిసింది. 

అసలువన్నీ ఆగిపోయినయ్.. 

స్పెషల్ డెవలప్‌‌మెంట్ ఫండ్.. ఎస్సీ, ఎస్టీ డిపార్ట్‌‌మెంట్‌‌లోనే కాకుండా ఇతర డిపార్ట్‌‌మెంట్‌‌ స్కీమ్‌‌లకూ మళ్లిస్తున్నారు. రాష్ట్రం వచ్చాక రెండు సార్లు మాత్రమే ఎస్టీ కార్పొరేషన్‌‌‌‌ ద్వారా రుణాలు మంజూరు చేశారు. నిరుడు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌‌‌‌ సబ్సిడీ లోన్లకు దరఖాస్తులు తీసుకుని మూలకు పడేశారు.