కార్పొరేషన్లు, సంస్థల అప్పులకు రాష్ట్ర సర్కారు పూచీకత్తు

కార్పొరేషన్లు, సంస్థల అప్పులకు రాష్ట్ర సర్కారు పూచీకత్తు

న్యూఢిల్లీ, వెలుగు: ఎనిమిదేండ్లలో రూ.1,67,308 కోట్ల అప్పులకు తెలంగాణ ప్రభుత్వం గ్యారంటీలు పెట్టిందని కేంద్రం చెప్పింది. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సమాధానం ఇచ్చింది. 2014 – 2022 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తెలంగాణ సర్కారుకు చెందిన కార్పొరేషన్లు, సంస్థల అప్పులకు పూచికత్తు పెట్టినట్లు తెలిపింది.

ఇందులో 2014–15లో రూ.100 కోట్లు, 2015–16లో రూ.1,830 కోట్లు, 2016–17లో రూ.24,820.61 కోట్లు, 2017–18లో రూ.22,689.70 కోట్లు, 2018–19లో రూ.11,927.92 కోట్లు, 2019–20లో రూ.22,020.91 కోట్లు, 2020–21లో రూ.48,294.18 కోట్లు, 2021–22లో రూ.35,624.75 కోట్లకు గ్యారంటీలు పెట్టినట్లు వెల్లడించారు.