కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమి..

కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమి..

తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టుకు నిర్మణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్టు సర్కార్ జీవో విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్  మండలం ప్రేమావతి పేట్ బుద్వేల్ గ్రామం పరిధిలో  ఉన్న 100 ఎకరాలను హైకోర్టు ప్రాంగణం కోసం కేటాయిస్తున్నట్లు జీవోలో తెలిపింది. కాగా, ప్రస్తుతం ఉన్న భవనం కోర్టుకు సరిపోవడం లేదని హైకోర్టు న్యాయమూర్తులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు.

 ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో.. కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 100 ఎకరాలు ఇస్తున్నట్టు తెలిపింది. కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యకలాపాలు పాత భవనంలోనే జరుగుతాయి.  ఆ తర్వాత హెరిటేజ్‌ భవనంగా పరిరక్షించనున్నారు.