రుణమాఫీ నిధులు విడుదల..మొదటి విడుతలో వారికే

రుణమాఫీ నిధులు విడుదల..మొదటి విడుతలో వారికే

రుణమాఫీ నిధులను విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. 37 వేల రూపాయల నుంచి 41 వేల రూపాయల మధ్య ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ 167 కోట్లు విడుదల చేసిందన్నారు. 

ప్రభుత్వ నిర్ణయం ద్వారా 44 వేల 870 మంది రైతులకు లబ్ది జరుగుతుందని హరీశ్ చెప్పారు. అన్నదాతలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్...రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారని చెప్పారు.   బీఆర్ఎస్ అంటే రైతు సంక్షేమ పార్టీ  అని మరోసారి నిరూపించామన్నారు.

2023 ఆగస్టు 03 నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని  పునః ప్రారంభించాలని నిన్న(ఆగస్టు 2)  అధికారులను  సీఎం ఆదేశించారు.  రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ 45రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు.