బీఈడీ కోర్సుల ఫీజ్ పెంచిన ప్రభుత్వం

బీఈడీ కోర్సుల ఫీజ్ పెంచిన ప్రభుత్వం

రూ.16 వేల నుంచి రూ.36 వేల వరకు ఫిక్స్‌‌ చేసిన సర్కార్‌

హైదరాబాద్, వెలుగు: బీఈడీ కాలేజీ ఫీజులను ప్రభుత్వం ఎట్టకేలకు ఖరారు చేసింది. ఒక్కో ఏడాదికి అత్యధికంగా రూ.36వేలు, అత్యల్పంగా రూ.16 వేలుగా నిర్ణయించింది. గతంతో పోలిస్తే 10 శాతానికి మించి ఫీజులు పెరిగాయి. ఈ మేరకు స్పెషల్ సీఎస్​ చిత్రారాంచంద్రన్ ఉత్తర్వులు జారీచేశారు. 2013లో బీఈడీ కాలేజీల ఫీజులు పెంచారు. 2016లో టీఏఎఫ్​ఆర్సీ ప్రతిపాదనలు పంపినా, సర్కారు ఆమోదించలేదు. దీంతో ఇప్పటివరకూ పాత ఫీజులే కొనసాగుతున్నాయి. అయితే 2019–20 విద్యాసంవత్సరంలోనే జస్టిస్ స్వరూప్ రెడ్డి నేతృత్వంలోని టీఏఎఫ్‌‌ఆర్సీ కమిటీ 209 బీఈడీ కాలేజీల ఫీజుల ప్రతిపాదనలు పంపితే, ప్రభుత్వం ఏడాది ఆలస్యంగా జీవో ఇచ్చింది. అయితే ఈ ఫీజులను 2019–20 నుంచి 2021–22 విద్యాసంవత్సరాలకు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాలేజీలు ఇతర ఫీజులేవీ వసూలు చేయవద్దని, అలా చేసిన కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. తాజాగా, గతేడాది నుంచి ఫీజులు పెంచుతున్నట్లు సర్కారు జీవో ఇచ్చింది.

For More News..

సెక్రటేరియట్ చెట్ల తరలింపుకు 5 కోట్లు

ఈఎస్​ఐ స్కామ్​లో 4.5 కోట్లు సీజ్​

తెలంగాణలో కొత్తగా 2,832 కరోనా పాజిటివ్ కేసులు