వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

వాహనదారులకు తెలంగాణ  ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తామని ఇటీవల ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. అనుకున్నట్లుగానే పెండింగ్ చలాన్ల రాయితీపై జీవో విడుదల చేశారు. ఇవాళ్టి నుంచే (డిసెంబర్ 26) పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తిస్తుందని జీవోలో తెలిపారు.  

ఇటీవల కాలంలో పెండింగ్ చలాన్లు పెద్ద సంఖ్య చెల్లించకుండా పెండింగ్ ఉన్నాయి.. కోవిడ్ కారణంగా వెహికల్స్ ఓనర్స్ పెండింగ్ చలాన్లు చెల్లించపోయారు. కొన్ని వెహికల్స్ పై వాటి వ్యాల్యూ కంటే ఎక్కువ మొత్తం లో చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది. 

టూవీలర్స్,త్రీ వీలర్స్ పై 80 శాతం, టీఎస్ ఆర్టీసీ బస్సులపై 90 శాతం, 60 శాతం లైట్ వెయిట్ లేదా హెవీ వెయిట్ మోటార్ వెహికల్స్, కార్లపై 60 శాతం రాయితీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.  

  • టూవీలర్స్,త్రీ వీలర్స్ 80 శాతం
  • టీఎస్పై ఆర్టీసీ బస్సులపై  90 శాతం 
  • లైట్ వెయిట్ వెహికల్స్ , హెవీ వెయిట్ వెహికల్స్, కార్లపై 60 శాతం రాయితీ