626 టీచర్ల మ్యూచువల్ బదిలీలకు ఒకే

626 టీచర్ల మ్యూచువల్ బదిలీలకు ఒకే
  • నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ల మ్యూచువల్ బదిలీలకు సర్కారు ఒకే చెప్పింది. 626 పరస్పర బదిలీలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు నేడో, రేపో రిలీజ్ కానున్నా యి. అయితే, జీవో 317 బాధిత టీచర్లకు ఉపశమనం కోసం రెండోసారి మ్యూచువల్ బదిలీలకు అవకాశం ఇచ్చింది. దీంతో 931 పరస్పర బదిలీలకు అప్లికేషన్లు అందాయి. విద్యాశాఖ అధికారులు వీటిని వెరిఫై చేయగా.. నిబంధనలకు విరుద్ధంగా కొందరు అప్లై చేసుకున్నట్టు గుర్తించారు. 

డిసెంబర్​లోనే అప్లై చేసు కోవడంతో జనవరి రిటైర్ అయిన వారితో పాటు డీఎస్సీ 2024 టీచర్లు, రెండోసారి మ్యూ చువల్ బదిలీలకు అప్లై చేసుకున్నవారిని పక్కన పెట్టారు. ఈ లెక్కన సుమారు 637 పరస్పర బదిలీలకు గ్రీన్​సిగ్నల్ తెలుపుతూ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఫిబ్రవరిలో సర్కారు కు ప్రతిపాదనలు పంపించారు.  ఫిబ్రవరిలో మ్యూచువల్ బదిలీలకు సర్కారు అనుమతి ఇవ్వకపోవడంతో ఆ నెలలో రిటైర్ అయిన మరో 11 మందిని పక్కన పెట్టినట్టు తెలుస్తున్నది.