ఆడిటర్లు హెల్త్ని కాపాడుకోవాలి : గవర్నర్ తమిళి సై

ఆడిటర్లు హెల్త్ని కాపాడుకోవాలి : గవర్నర్ తమిళి సై

హైదరాబాద్ ​ఏజీ ఆఫీసులో నిర్వహించిన ఆడిట్ వీక్ ప్రారంభోత్సవ వేడుకలకు తెలంగాణ గవర్నర్ తమిళి సై హాజరయ్యారు. వారం రోజుల పాటు ఈ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఆడిట్ వీక్ వేడుకల ద్వారా అందరికీ అవగాహన వస్తుందన్నారు గవర్నర్ తమిళిసై. ఆడిట్ వీక్ వేడుకల్లో అధికారులు సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరారు. వరల్డ్ ఇన్స్టిట్యూషన్ కు, గ్లోబల్ ఎస్ట్రెనల్ ఆడిట్ గా రాణిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇందుకోసం కృషి చేసిన ఉద్యోగులందరికీ హ్యాట్సాఫ్ అని చెప్పారు. 

ప్రజల డబ్బును హ్యాండిల్ చేస్తుంటారు గనుక ఉద్యోగులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని గవర్నర్ సూచించారు. ఆడిటర్లు అందరూ హెల్త్ ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. మహిళా అధికారులు ఎక్కువ మంది కనపడుతున్నారని, ఈ విషయంలో తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి నుండే పిల్లలకు అకౌంట్స్ పై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ వేడుకలకు తాను హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు.https://twitter.com/ParimalSuklaba1/status/1726520720329699654