ఈ వివరాలు రెడీ చేసుకోండి : 6 గ్యారంటీల అభయ హస్తం అప్లికేషన్ ఇదే..

ఈ వివరాలు రెడీ చేసుకోండి : 6 గ్యారంటీల అభయ హస్తం అప్లికేషన్ ఇదే..

కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ఆరు గ్యారంటీలకు సంబంధించిన అభయ హస్తం అప్లికేషన్ ను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 28వ తేదీ నుంచి 2024 జనవరి 6వ తేదీ వరకు గ్రామాల్లో ఈ అప్లికేషన్ ను అందించాల్సి ఉంటుంది. నాలుగు పేజీల అభయ హస్తం అప్లికేషన్ ఎలా ఉంది.. ఏయే వివరాలు అందజేయాల్సి ఉంటుంది అనేది వివరంగా తెలుసుకుందాం..

మొదటి పేజీ :

మన పేరు, లింగ నిర్థారణ, కులం వివరాలు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

రెండో పేజీ :

దరఖాస్తుదారుని పూర్తి చిరునామా.. ఇంటి నెంబర్, వీధి, గ్రామం, మున్సిపాలిటీ, కార్పొరేషన్, వార్డు నెంబర్, మండలం, జిల్లా వివరాలు నమోదు చేయాలి.
 మహాలక్ష్మి పథకం వివరాలు ఉంటాయి. ప్రతినెలా 2 వేల 500 రూపాయల ఆర్థిక సాయం అవసరమా లేదా అనే కాలం ఉంటుంది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్ కంపెనీ పేరు, సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వినియోగించుకుంటున్నారు అనే సంఖ్య ఇవ్వాలి.

రైతు భరోసా పథకం :

రైతునా.. కౌలు రైతునా అనే వివరాలు ఇవ్వాలి. పట్టాదారు పాసు పుస్తకం నెంబరు ఇవ్వాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు అయిన సర్వే నెంబర్లు, విస్తీర్ణం వివరాలు నమోదు చేయాలి. అదే విధంగా వ్యవసాయ కూలీలకు ఏటా ఇచ్చే 12 వేల రూపాయలకు సంబంధించి ఉపాధి హామీ కార్డు నెంబర్ నమోదు చేయాలి. 

ఇందిరమ్మ ఇండ్ల పథకం :

ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఉంది. అమరవీరులు మరిము ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అమరవీరుల పేరు, అమరలైన సంవత్సరం.. ఎఫ్ఐఆర్ నెబర్, డెత్ సర్టిఫికెట్ నెంబర్ నమోదు చేయాలి.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా లేదా అనే వివరాలు ఇవ్వాలి. ఒక వేళ జైలుకు వెళ్లినట్లయితే జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధించిన వివరాలు.. శిక్షా కాలం వివరాలు నమోదు చేయాలి. 

మూడో పేజీ :

గృహ జ్యోతి పథకం :

కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. 
మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత ఉంటుంది. 100 యూనిట్ల.. 200 యూనిట్ల, 200 యూనిట్లపైన ఉంటుందా అనేది నమోదు చేయాలి. అదే విధంగా కరెంట్ మీటర్ కనెక్షన్ సంఖ్య నమోదు చేయాలి.

చేయూత పథకం :

  • చేయూత పథకం కింద నెలకు 4 వేలు మరియు దివ్యాంగుల పింఛన్ 6 వేలు పొందేందుకు ఈ కింద వివరాలను తెలపాలి (ప్రస్తుతం ఫించన్ పొందుతున్న వారు కొత్తగా దరఖాస్తు నమోదు చేయాల్సిన అవసరం లేదు )
  • దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్ నెంబర్. ఇతరులు అయితే వృద్యాప్య పింఛన్, వింతు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఫైలేరియా బాధితులు, ఒంటరి మహిళ జీవన భృతి, బీడీ టెకేదార్ జీవన భీతి వివరాలు నమోదు చేయాలి. ఏ పథకం కింద అర్హులో నమోదు చేయాలి.  

నాలుగో పేజీ :

  •  అధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ జత చేయాలి. 
  • దరఖాస్తు ఇచ్చిన తర్వాత ప్రజా పాలన రశీదు ఇస్తారు.