తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌‌ల బదిలీ

తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌‌ల బదిలీ
  • 21 మంది నాన్ కేడర్ ఎస్పీలు కూడా..
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మరోసారి భారీగా ఐపీఎస్‌‌ల బదిలీలు జరిగాయి. 23 మంది ఐపీఎస్ లు, 21 మంది నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్షన్ కోడ్‌‌లో భాగంగా ట్రాన్స్‌‌ఫర్ అయిన అధికారులను మళ్లీ వివిధ ప్రాంతాలకు కేటాయించారు. స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ చీఫ్‌‌గా వీవీ శ్రీనివాస్ రావును, సిద్దిపేట సీపీగా అనురాధను నియమించారు. రామగుండం సీపీగా ఎల్ఎస్ చౌహాన్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా రోహిత్ రాజ్, మేడ్చల్ డీసీపీగా నితికా పంత్, మల్కాజిగిరి డీసీపీగా పద్మజ, కో ఆర్డినేషన్ డీఐజీగా గజరావు భూపాల్​ను నియమించారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం డీఐజీగా రెమా రాజేశ్వరి, జోన్ 7 (జోగులాంబ) డీఐజీగా జోయల్ డేవిస్ ను నియమించారు. ఖమ్మం సీపీగా పనిచేసిన విష్ణు వారియర్​ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. నిర్మల్ ఎస్పీగా జానకి షర్మిల, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీగా జానకి ధరావత్, ఖమ్మం సీపీగా సునీల్ దత్, సీఐడీ ఎస్పీగా రాజేంద్రప్రసాద్, టీఎస్ ట్రాన్స్​కో ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీగా సీహెచ్‌‌.శ్రీనివాస్‌‌, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3గా వెంకటేశ్వర్లు, జయశంకర్ భూపాలపల్లి ఓఎస్డీగా అశోక్ కుమార్, ఎల్​బీనగర్ డీసీపీగా సీహెచ్ ప్రవీణ్​కుమార్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు డీసీపీగా శబరీష్, మాదాపూర్ డీసీపీగా వినీత్, ఆదిలాబాద్ ఎస్పీగా గౌస్ అలాం, మెదక్ ఎస్పీగా బాలస్వామిని ప్రభుత్వం నియమించింది. వారితో పాటు రాష్ట్రంలో మరో 21 మంది నాన్ కేడర్ ఎస్పీల