ఎంఎంటీఎస్ ఫేజ్–2 వచ్చేది ఎప్పుడు ?

ఎంఎంటీఎస్ ఫేజ్–2 వచ్చేది ఎప్పుడు ?
  • ఏండ్లుగా తన వాటా ఇవ్వని రాష్ట్ర సర్కార్
  • రూ.543 కోట్లకు తెలంగాణ ఇచ్చింది రూ.129 కోట్లే
  • నాలుగేండ్ల కిందనే వాటా చెల్లించిన రైల్వే
  • ఫండ్స్​ లేక ముందుకు సాగని పనులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్​కి మోక్షం కలగడం లేదు. ఏండ్ల తరబడి తెలంగాణ ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో పనులు ముందుకు సాగట్లేవు. రైల్వే మాత్రం తన వాటా కంటే అధికంగా ఖర్చు చేసినా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. ఈ రూట్ అందుబాటులోకి వస్తే మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఘట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శంషాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తక్కువ ధరకే జర్నీ చేసే అవకాశం ఉంది. 

రైల్వే ‘డబుల్’ ఖర్చు
సిటీలో సబర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాసింజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 2003లో ఎంఎంటీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టును ప్రారంభించాయి. మొదటి దశ పనులు పూర్తి కావడంతో వివిధ ప్రాంతాలకు సర్వీసులు నడుస్తున్నాయి. 2012--–13 ఆర్థిక సంవత్సరంలో ఎంఎంటీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2 ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంజూరైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో చేపట్టే ఈ పనులు 2019 వరకు పూర్తి చేయాల్సి ఉంది. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖర్చు అంచనా రూ.816 కోట్లు. ఇందులో తెలంగాణ వాటా రూ.543 కోట్లు. రైల్వే వాటా రూ.273 కోట్లు. రైల్వే తన వాటాను నాలుగేండ్ల క్రితమే చెల్లించింది. రాష్ట్రం నిధులు ఇవ్వకపోడంతో రైల్వే అదనంగా రూ.750 కోట్లకు పైగా ఖర్చు చేసింది.

రూ.129 కోట్లు ఇచ్చిన రాష్ట్రం 
రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో పనులు స్లోగా సాగుతున్నాయి. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద తెలంగాణ ప్రభుత్వం వాటా రూ.543 కోట్లు. కానీ, ఇప్పటి వరకు సర్కారు రూ.129 కోట్లు మాత్రమే ఇచ్చింది. ప్రభుత్వం తన వాటాలో 24 శాతం మాత్రమే ఖర్చు చేసింది. ఇంకా రూ.414 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టింది. వరుసగా రెండు బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఒక్క పైసా కేటాయించకుండా నిర్లక్ష్యం చేసింది. మొత్తం 72.95 కిలోమీటర్ల మార్గంలో ఇప్పటివవరకు 62 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ట్రైన్ కోచ్​లు కొనేందుకు, ఇతర పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇస్తే తప్ప రైళ్లు నడిపే పరిస్థితి లేదని అధికారులు చెప్తున్నారు. నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్​కు కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఎన్నోసార్లు లెటర్లు రాసినా ఫలితం సున్నా.

అందుబాటులోకి వస్తే ఎన్నో లాభాలు
ఎంఎంటీఎస్​ ఫేజ్–2 అందుబాటులోకి వస్తే అనేక విధాలుగా ప్రజలకు ప్రయోజనం కలగనుంది. దీని ద్వారా రెండు లక్షల మంది జర్నీ చేసే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. ఇప్పటికే సిటీలో పెరిగిపోయిన ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాబ్లమ్స్​కూడా కొంత వరకు క్లియర్ అవుతాయి. డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఎంఎంటీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేవలు అందుబాటులోకి వస్తే.. తక్కువ ఖర్చుతో జర్నీ చేయొచ్చు. ఇక ఫేజ్–2 లైన్​ను రాయగిరి వరకు విస్తరించాలనుకున్నా ఆ ప్రపోజల్ అటకెక్కింది.