ర్యాలంపాడుకు రిపేర్లు చేసేదెన్నడు?

ర్యాలంపాడుకు రిపేర్లు చేసేదెన్నడు?
  •     సర్వేల పేరుతో కాలయాపన చేసిన గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     రిపేర్లు చేయకపోవడంతో సగానికి తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం
  •     1.36 లక్షల ఎకరాల్లో క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాలీడే
  •     ప్రస్తుత సర్కారైనా రిపేర్లు పూర్తి చేయాలని వేడుకోలు

గద్వాల, వెలుగు :   గత ప్రభుత్వ నిర్లక్ష్యం ర్యాలంపాడు ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఐదేళ్ల కింద బుంగలు పడి నీరు లీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నా పట్టించుకోకుండా సర్వేలు, తనిఖీల పేరుతో కాలయాపన చేశారు. దీంతో రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీటి నిల్వ సామర్థ్యం సగానికి తగ్గిపోయింది. ఈ కారణంతో వరుసగా రెండో ఏడాదీ 1.36 లక్షల ఎకరాల ఆయకట్టులో క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాలీడే ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలోనే 80 శాతం పనులు

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలో నెట్టెంపాడు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూపకల్పన చేశారు. కృష్ణా బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎత్తిపోసే విధంగా రూపొందించిన ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో ర్యాలంపాడు, గుడ్డందొడ్డి, ముచ్చోనిపల్లి, సంగాల, నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దొడ్డి రిజర్వాయర్లను నిర్మించారు. ఆయా రిజర్వాయర్లలో మొత్తం 10 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఈ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో ర్యాలంపాడు రిజర్వాయరే అతిపెద్దది. నాలుగు టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యంతో ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా 25 వేల ఎకరాలకు, రైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా 1.11 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి 80 శాతం పనులు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలోనే పూర్తయ్యాయి. తర్వాత ఏర్పడిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించింది. 

లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పట్టించుకోని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంపై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు నుంచి చిన్నచూపే చూసింది. కనీసం మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా డబ్బులు రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకపోవడంతో రిజర్వాయర్లు, కెనాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ర్యాలంపాడు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 2019లో బుంగలు పడి నీరు లీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవడం స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీపేజీ మరింత పెరిగింది. రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిపేర్లు చేయాలని రైతులు ఆందోళనకు దిగడంతో  2021లో రిటైర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్ల బృందం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించింది. పూర్తి స్థాయిలో నీటిని నింపితే కట్టకు ప్రమాదమని గుర్తించడంతో నీటి నిల్వ కెపాసిటీని సగానికి తగ్గించారు. దీంతో రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 4 టీఎంసీలు అయితే మూడేళ్ల నుంచి రెండు టీఎంసీల నీటినే నిల్వ చేస్తున్నారు.

వరుసగా రెండో ఏడాదీ క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాలీడే

ర్యాలంపాడు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేయకపోవడం వల్ల రబీ పంటలకు నీళ్లు ఇవ్వలేమని చెప్పి ఈ సారి క్రాప్ హాలీడే ప్రకటించారు. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా పొలాలను పడావు పెట్టాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచే గట్టు మండలంలో నిర్మిస్తున్న గట్టు లిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నీటిని ఎత్తిపోయాల్సి ఉంది. కానీ ర్యాలంపాడులోనే పూర్తిస్థాయిలో నీటి నిల్వ లేకపోవడంతో గట్టు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కూడా క్లారిటీ లేకుండా పోయింది. బుంగలను గుర్తించిన వెంటనే రిపేర్లు చేసి ఉండే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టడీ చేస్తోంది

సర్వే కంప్లీట్ అయింది. రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పైఆఫీసర్లకు పంపించాం. టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టడీ చేస్తోంది. సీడీవో ఆదేశాల మేరకు రిపేర్లు పూర్తి చేస్తాం. సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఈఈ,  ర్యాలంపాడు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి

రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏముంది? 

బుంగలకు రిపేర్లు చేసి పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలని రైతులు ఆందోళనకు దిగడంతో రిటైర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్ల టీం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించిన అనంతరం సర్వే చేయాలని నిర్ణయించారు. సర్వే పనులను టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన శ్రీసాయి గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థకు అప్పగించారు. సర్వే పూర్తి చేసిన సంస్థ బుంగలు ఎలా పడ్డాయి ? ఎలా పూడ్చాలి ? అనే అంశాలపై ఇచ్చిన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆఫీసర్లు సెంట్రల్ డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫార్వార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సర్వే పూర్తయి రెండేళ్లు దాటింది. అయినా ఇప్పటివరకు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిపేర్లు చేస్తలేరు.. రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏముందో బయటపెట్టడం లేదు. అయితే రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్ట బలహీనంగా ఉండడం వల్లే సీపేజీ వచ్చిందని, రివిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలగించి మళ్లీ కట్టాలని, అలాగే కట్ట పైభాగం నుంచి గ్రౌటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని సర్వే చేసిన సంస్థ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నీళ్లు లేనందున పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తి చేస్తే, వచ్చే ఖరీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికైనా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసుకోవచ్చని రైతులు అంటున్నారు.