ఆర్టీసీకి రెండు ఇంధన పొదుపు అవార్డులు

ఆర్టీసీకి రెండు ఇంధన పొదుపు అవార్డులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఆర్టీసీకి ‘రెన్యూవబుల్‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, ఎనర్జీ కన్జర్వేషన్‌‌‌‌‌‌‌‌’ అవార్డులు దక్కాయి. రవాణా విభాగంలో ఇంధనాన్ని ఎక్కువగా ఆదా చేసిన సత్తుపల్లి డిపోకు గోల్డెన్‌‌‌‌‌‌‌‌, గోదావరిఖనికి సిల్వర్‌‌‌‌‌‌‌‌ అవార్డు లభించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌‌‌‌‌‌‌‌ తమిళి సై చేతుల మీదుగా ఈడీ వినోద్‌‌‌‌‌‌‌‌, చీఫ్‌‌‌‌‌‌‌‌ మెకానికల్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ రఘునాథరావు, సత్తుపల్లి డిపో మేనేజర్‌‌‌‌‌‌‌‌ జేబీ బాబు అవార్డులను అందుకున్నారు. అవార్డులు రావడంపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఆర్టీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌, ఎండీ సజ్జనార్‌‌‌‌‌‌‌‌ హర్షం వ్యక్తం చేశారు.