హైకోర్టులో టీఎస్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌కో రిట్‌‌‌‌

హైకోర్టులో టీఎస్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌కో రిట్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఏపీ ట్రాన్స్‌‌‌‌కో తమకు బకాయిలు చెల్లించడం లేదని తెలంగాణ ట్రాన్స్‌‌‌‌కో హైకోర్టును ఆశ్రయించింది. అసలు, వడ్డీతో కలిపి రూ.1730 కోట్లు ఏపీ ట్రాన్స్‌‌‌‌కో చెల్లించాలన్న రిట్‌‌‌‌పై జస్టిస్‌‌‌‌ పి.నవీన్‌‌‌‌రావు, జస్టిస్‌‌‌‌ శ్రీనివాసరావుల డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ విచారణ చేపట్టింది.

వాదనల తర్వాత హైకోర్టు.. కేంద్ర, ఏపీ సర్కార్, ఏపీ ట్రాన్స్‌‌‌‌కో, ఇతరులకు నోటీసులు ఇచ్చింది. ఇదే తరహాలో గతంలో తెలంగాణ ట్రాన్స్‌‌‌‌కో వేసిన రిట్‌‌‌‌తో కలిపి దీనిని కూడా విచారణ చేస్తామని స్పష్టం చేసింది. ఈలోగా ప్రతివాదులు కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌‌‌‌ 13కు వాయిదా వేసింది.