కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి హరీశ్ రావు లేఖ

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి హరీశ్ రావు లేఖ

కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేసే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. వైరస్ వ్యాప్తిని కొంత మేర కట్టడి చేయడంలో, వైరస్ సోకిన వారికి తీవ్రమైన లక్షణాలు రాకుండా చేయడంలో వ్యాక్సిన్ పాత్ర కీలకమని చాలా అధ్యయనాల్లో వెల్లడైందన్నారు. ఇప్పుడు బూస్టర్ డోసు వేయడం ద్వారా వైరస్ ను మరింత మెరుగ్గా ఎదుర్కోవచ్చని అమెరికా, యూకే లాంటి దేశాల్లో తేలిందని, దీని దృష్ట్యా వ్యాక్సిన్ రెండో డోసుకు, బూస్టర్ డోసుకు మధ్య గ్యాప్ తగ్గించాలని కోరుతూ హరీశ్ లేఖ రాశారు.

లేఖలోని కీలక అంశాలు..

  • వ్యాక్సిన్ రెండో డోసు, బూస్టర్ డోసుకు మధ్య గ్యాప్ ను తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని హరీశ్ రావు కోరారు.
  • హెల్త్ కేర్ వర్కర్లకు బూస్టర్ డోసు వ్యాక్సిన్ వేసే గ్యాప్ ను మరింతగా తగ్గించడంపై దృష్టి పెట్టాలని తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీశ్ తన లేఖలో సూచించారు. వారికి రెండో డోసు తీసుకున్న మూడు నెలలకే బూస్టర్ డోసు వేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కోరారు.
  • కోమార్బిడ్ కండిషన్లతో సంబంధం లేకుండా 60 ఏండ్లు పైబడిన వాళ్లందరికీ బూస్టర్ డోసు వేసేలా నిబంధనలను మార్చాలని హరీశ్ రిక్వెస్ట్ చేశారు. 
  • అలాగే 18 ఏండ్లు పైబడిన అందరికీ బూస్టర్ డోసు వేయడంపై ఆలోచన చేయాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.

మరిన్ని వార్తల కోసం..

ఆన్లైన్లో పెళ్లి.. అతిధుల ఇంటికే భోజనం..

టెస్టు కెప్టెన్సీపై మనసులోమాట బయట పెట్టిన రాహుల్

పెట్రోల్ కొనుక్కోవడానికి శ్రీలంకకు భారత్ అప్పు