
వ్యూహం..వ్యూహం..వ్యూహం..ఇప్పుడు రాజకీయా నాయకుల్లో..సినీ ప్రేక్షకుల్లో హీట్ పెంచుతోన్న ఫిల్మ్. ప్రస్తుతం వ్యూహం సినిమాపై జరుగుతున్న దాడులు..నిరసనలు..కామెంట్స్..సినిమా రిలీజ్ అవ్వకపోవడానికి కారణం అయ్యాయి. దీంతో సినిమా రెండుసార్లు రిలీజ్ డేట్స్ మారిపోయాయి.
అంతేకాకుండా వ్యూహం (Vyooham) సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ చట్టవిరుద్ధమని..అంతేకాకుండా చంద్రబాబు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ మూవీ రిలీజ్ చేయొద్దని నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేష్ పిటిషన్ ను విచారణ చేసిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 11వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇవాళ (డిసెంబర్ 3న) వ్యూహం మూవీ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే సినిమా విడుదలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును..ప్రొడ్యూసర్ దాసరి కిరణ్‌కుమార్ సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.
ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీని వరుసగా పోస్ట్ ఫోన్ చేస్తుండటంతో..రూ.కోట్లలో నష్టం వచ్చిందని నిర్మాత కిరణ్ తరఫు లాయర్..కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ విచారణను సింగిల్ బెంచ్ న్యాయస్థానం ఈనెల (జనవరి 11కు) వాయిదా వేసిందని తెలిపారు. దీంతో ఇవాళ స్పందించిన తెలంగాణ హైకోర్టు..సింగిల్ బెంచ్‌లోనే ఏదైనా తేల్చుకోవాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది.
అయితే, వ్యూహం సినిమాకు సంబంధం లేని వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారని..ప్రభుత్వం వాదనలు జరిగాయి. ఈనెల 11 వరకు వ్యూహం సినిమా రిలీజ్ చేయొద్దని..ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ, ఈనెల 11కు బదులు 8 వ తేదీన విచారణ జరిపి..ఆదేశాలు ఇవ్వాలని సినిమా మేకర్స్ కోరారు.
దీంతో మెరిట్స్ ఆధారంగా చేసుకుని ఈనెల 8 న వ్యూహం సినిమాపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జ్ కు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇక, వ్యూహం మూవీ మేకర్స్ వేసిన అప్పీల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్పోస్ చేసింది.