లైన్ క్లియర్..పంచాయతీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరణ

 లైన్ క్లియర్..పంచాయతీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరణ

తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై అడ్డంకి తొలగింది.  పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జారీ చేసిన  జీవో  46 ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై  హై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా   ఎన్నికలపై స్టే విధించలేమని హైకోర్టు తెలిపింది.  ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని చెప్పింది.  తామే ఎలక్షన్స్ నిర్వహించాలని ఆదేశించి..తామే ఎలా స్టే ఇవ్వగలమని పిటిషనర్ కు సూచించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. 

జీవో 46 పై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా..  సబ్ క్యాటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలు రద్దు చేయాలనీ కోరుకుంటున్నారా ?అని పిటిషనర్ ను ప్రశ్నించింది హైకోర్టు.  42 శాతం రిజర్వేషన్ GO విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని తామే చెప్పాం.. అలాగే ఎన్నికలు జరుగుతున్నాయని కోర్టు చెప్పింది. ఈ దశలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని హై కోర్టు తెలిపింది.  తామే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించి.. తామే స్టే ఎలా ఇస్తామని ప్రశ్నించింది హైకోర్టు.  డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ను బహిర్గతం చేసి కాపీ ఇవ్వాలని కోరిన పిటిషనర్ కోరగా.. దీనిపై   ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది హై కోర్టు. సబ్ క్యాటగిరి  రిజర్వేషన్ ల పై ఆరు వారాల్లోపు  కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది.