పేలుళ్లకు అనుమతించే అధికారం ఎవరిది?..రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

పేలుళ్లకు అనుమతించే అధికారం ఎవరిది?..రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు:  కొండలు, రాళ్లను తొలగించడానికి, గనుల్లో నిర్వహించే పేలుళ్లకు అనుమతి ఇచ్చే అధికారం ఎవరికి ఉందో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీ పోలీసు చట్టం కింద కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుమతులు మంజూరు చేస్తున్నప్పటికీ ఇందులో ఎక్కడో అస్పష్టత ఉందని పేర్కొంది. పేలుళ్ల అనుమతులకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు లేకపోతే సంబంధిత అధికారిని ప్రతివాదిగా చేర్చడం ద్వారా భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యాచరణ రూపొందించడానికి వీలవుతుందని చెప్పింది.

 దీంతో ప్రభుత్వం స్పష్టమైన ఓ విధానం తీసుకురావడానికి అవకాశం ఉంటుందని వెల్లడించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యాయవిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనుక భాగంలో రాత్రిపూట పేలుళ్లు నిర్వహిస్తుండడంపై 2024లో హైకోర్టు న్యాయమూర్తి రాసిన లేఖను హైకోర్టు పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకుని విచారణ చేపట్టింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అపరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జి.ఎం.మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురువారం మరోసారి విచారణ చేపట్టింది. అదనపు అడ్వకేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహమ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. పేలుడు నిర్వహించడానికి ప్రత్యేక అధికారి ఉన్నారని, అంతేగాకుండా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా అధికారం ఉందని చెప్పారు. 

జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాత్రి 10 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు పేలుళ్లు నిర్వహించడానికి అనుమతి మంజూరైందని తెలిపారు. ఈ సమయంలో పేలుళ్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎవరైనా ఫిర్యాదు చేశారా, ఏవైనా కేసులు నమోదయ్యాయా అన్న వివరాలను తెలుసుకోవాల్సి ఉందని, వాటిపై వివరాలు సమర్పిస్తామని చెప్పారు. అంతేగాకుండా, అనుమతులు మార్చి 31తో ముగిశాయని, తాజా పరిస్థితిపై నివేదిక సమర్పిస్తామన్నారు. వాదనలను విన్న ధర్మాసనం తాజా పరిస్థితితో పాటు అనుమతులు మంజూరు చేసే అధికారం ఎవరికి ఉందో చెప్పాలంటూ విచారణను సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16కు వాయిదా వేసింది.