
- రాజ్యసభలో ఎంపీ అనిల్‌కుమార్ ప్రశ్నకు కేంద్రమంత్రి గడ్కరి రిప్లై
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో నేషనల్ హైవేల అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు వచ్చిన ప్రతిసారీ పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి స్పష్టం చేశారు. అయితే, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పూర్త యిన తర్వాతే ప్రాజెక్టును తీసుకోవాలా? లేదా? అనే విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ బుధవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు గడ్కరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
అలాగే, హైదరాబాద్–కల్వకుర్తి మధ్య ఫోర్ వే లేన్ల అభివృద్ధిపై ప్రజల నుంచి నిరంతర డిమాండ్లు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. తుక్కుగూడ–దిండి మధ్య (వయా కల్వకుర్తి) నేషనల్ హైవే –765 ను ఫోర్ వే లేన్లుగా విస్తరించేందుకు డీపీఆర్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు.