యాంటీ స్లిప్‌‌‌‌‌‌‌‌ టేప్‌‌‌‌‌‌‌‌: ఇది కొనుక్కుంటే వర్షాకాలం మెట్లపై జారి పడే ఛాన్సే లేదు !

యాంటీ స్లిప్‌‌‌‌‌‌‌‌ టేప్‌‌‌‌‌‌‌‌: ఇది కొనుక్కుంటే వర్షాకాలం మెట్లపై జారి పడే ఛాన్సే లేదు !

వర్షపు చినుకులు పడినప్పుడు, లేదా నీళ్లతో కడిగినప్పుడు మెట్ల మీద తడి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు పెద్దవాళ్లు, పిల్లలు జారిపడే ప్రమాదం ఉంది. ద్రురి అనే కంపెనీ తీసుకొచ్చిన ఇలాంటి యాంటీ స్లిప్‌‌‌‌‌‌‌‌ టేప్‌‌‌‌‌‌‌‌ని మెట్ల మీద అతికిస్తే ఆ సమస్యే ఉండదు. తడిగా ఉన్న పాలిష్డ్​ మార్బుల్‌‌‌‌‌‌‌‌ మెట్ల మీద అడుగుపెట్టినా కాలు జారదు. దీని ఇన్‌‌‌‌‌‌‌‌స్టాలేషన్‌‌‌‌‌‌‌‌ కూడా చాలా ఈజీ. ఈ టేప్‌‌‌‌‌‌‌‌కి కింది భాగంలో ఉండే పేపర్‌‌‌‌‌‌‌‌ను తీసేసి, పై భాగాన్ని మెట్లమీద అతికిస్తే సరిపోతుంది. 

మెట్లు, వాకింగ్‌‌‌‌‌‌‌‌ చేసే ప్లేస్‌‌‌‌‌‌‌‌లు,  నిచ్చెనలు, డెక్‌‌‌‌‌‌‌‌లు, హ్యాండిక్యాప్ ర్యాంప్‌‌‌‌‌‌‌‌లు, రన్నింగ్ బోర్డులు.. ఇలా ఎక్కడైనా దీన్ని వాడొచ్చు. ఇది వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ అడ్​హెసివ్‌‌‌‌‌‌‌‌తో వస్తుంది. కాబట్టి నీళ్లలో తడిచినా ఊడిపోదు. వుడ్‌‌‌‌‌‌‌‌, కాంక్రీటు, మెటల్, టైల్స్.. ఇలా దేనికైనా గట్టిగా అతుక్కుపోతుంది. అంతేకాదు.. ఈ టేప్‌‌‌‌‌‌‌‌కి మధ్యలో రేడియం లైన్‌‌‌‌‌‌‌‌ కూడా ఉంటుంది. ఇది చీకట్లో మెట్లు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది.

ధర: 295