సిలబస్ తగ్గిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం

సిలబస్ తగ్గిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం

ఇంటర్ సిలబస్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఇంటర్ బోర్డు. 70శాతం సిలబస్ తోనే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని సర్కక్యులర్ జారీ చేసింది. కరోనా కారణంగా జూన్ లో మొదలుకావాల్సిన కాలేజీలు.. ఆలస్యంగా సెప్టెంబర్ లో ప్రారంభమయ్యాయి. దీంతో వందశాతం సిలబస్ తో కాకుండా 30 శాతం తగ్గించి.. 70శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ఇంటర్ బోర్డు. ఎగ్జామ్స్ నిర్వహించే 70శాతం సిలబస్ తో పాటు.. తొలగించిన 30 శాతం సిలబస్ వివరాలను వెబ్ సైట్ లో పెట్టామని అధికారులు చెప్తున్నారు. అంతే కాకుండా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్స్ ను కూడా అందుబాటులో ఉంచింది ఇంటర్ బోర్డు.