ఇంటర్​ ఫలితాలు రిలీజ్ .. మెదక్ జిల్లా లాస్ట్

ఇంటర్​ ఫలితాలు రిలీజ్ .. మెదక్ జిల్లా లాస్ట్

రాష్ట్రంలో ఇంటర్​ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీసులో ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు.  ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఆమె ఒకేసారి విడుదల చేశారు.  గతేడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం తగ్గింది.  

ఈ ఏడాది ఫస్టియర్ ఫలితాలో 63.85 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  ఇందులో అమ్మాయిలే పైచేయి సాధించారు.   ఇందులో 75శాతంతో మేడ్చల్ మొదటిస్థానంలో నిలువగా, రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచింది.   ఇక సెకండియర్  ఫలితాలో  67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  

85శాతంతో మొదటిస్థానంలో ములుగు జిల్లా నిలిచింది. ఫస్టియర్, సెకండియర్ రెండు ఫలితాల్లో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.  అయితే గతేడాదితో పోలిస్తే ఇంటర్ ఉత్తీర్ణత శాతం తగ్గింది.  ఫస్టియర్ 2శాతం తగ్గగా,  సెకండియర్  1శాతం ఫలితాలు తగ్గాయి.   ఇంటర్​ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి సబిత అభినందనలు తెలిపారు. 

కాగా, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ ఇంటర్ ఎగ్జామ్స్ జరిగాయి. పరీక్షలకు మొత్తం 9.47 లక్షల మంది అటెండ్ కాగా, వీరిలో ఫస్టియర్ స్టూడెంట్లు 4.82 లక్షలు, సెకండియర్ స్టూడెంట్లు 4.65 లక్షల మంది ఉన్నారు. ఫలితాలను https://tsbie.cgg.gov.in , results.cgg.gov.inలో  చూడవచ్చు. కాగా రేపు పదో తరగతి పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.