తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. అందరూ పాస్

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. అందరూ పాస్
  • పరీక్ష ఫీజు కట్టిన వాళ్లంతా పాస్
  • ఫస్టియర్ వచ్చిన మార్కులే సెకండియర్ కు 
  • ప్రాక్టికల్స్ లో గరిష్ట మార్కులు
  • మార్కుల జాబితాలో తప్పులుంటే ఫిర్యాదుకు ఫోన్ నెంబర్ 040 24600110

హైదరాబాద్: ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సోమవారం వెల్లడించారు. పరీక్ష ఫీజు చెల్లించిన మొత్తం 4 లక్షల 51 వేల 585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లే పరిగణిస్తామని చెప్పారు. వీరిలో 2 లక్షల 28 వేల 754 మంది బాలికలు, 2 లక్షల 22 వేల 831 మంది బాలురు ఉన్నారు. గత ఏడాది అంటే ఫస్టియర్ లో వచ్చిన మార్కులే సెకండ్ ఇయర్ మార్కులు గా పరిగణిస్తామని మంత్రి తెలిపారు. ఈ ప్రకారం 1 లక్షా 76 వేల 719 మంది గ్రేడ్ –ఏ, 1 లక్షా 4 వేల 886 మంది గ్రేడ్ –బి,  61 వేల 887 మంది గ్రేడ్-సి, 1 లక్షా 8 వేల 93 మంది గ్రేడ్-డి  వచ్చింది. ఫలితాలపై సంతృప్తి లేకపోతే పరిస్థితులు మెరుగయ్యాక విద్యార్థులకు ప్రత్యేకంగా ఇంప్రూవ్ మెంట్ పరీక్ష నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. 
ఫలితాలకు వెబ్ సైట్లు:  http://tsbie.cgg.gov.in, http://examresults.ts.nic.in, http://results.cgg.gov.in లాగిన్ అయి తెలుసుకోవచ్చు. అంతే కాదు మార్కుల జాబితాలో ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉంటే ఫిర్యాదు చేసేందుకు అవకాశం  కల్పించారు. తప్పులుంటే సరిచేసుకునేందుకు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 040 24600110 కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. 
ప్రాక్టికల్ పరీక్షల్లో గరిష్ట మార్కులే అందరికీ కేటాయించారు. అలాగే మొదటి సంవత్సరం సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులనే సెకండియర్ మార్కులుగా నిర్ణయించారు. అలాగే ఎవరైనా గతంలో ఫెయిలై ఉంటే వారికి మినిమం పాస్ మార్కులు వేయడం జరిగింది. గతంలో ఫెయిలైన వారు తమ పాత హాల్ టికెట్ నెంబర్ ద్వారా కొత్త మార్కులు పొందవచ్చు. మార్కుల జాబితాలో తప్పులు సరిచేసుకునేందుకు 040 24600100 ఫోన్ నెంబర్ కు  ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.