తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షల తేదీలను విడుదల చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం ఆమోదించిన క్రమంలో.. శనివారం (అక్టోబర్ 25) ఇంటర్ బోర్డు అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇంటర్ పరీక్షల తేదీలతో పాటు.. ప్రాక్టికల్స్, పరీక్షల్లో చేస్తున్న మార్పులపై ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ సారి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 9 లక్షల 50 వేల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారని బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. సీఎం ఆదేశాలతో డిజిటల్ కంటెంట్ లోకి ప్రతి చాప్టర్ మారుస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ సిలబస్ లో ఆరు మార్పులు తీసుకొచ్చామని.. ప్రతి సబ్జెక్టును 80:20 లో విభజిస్తున్నామని అన్నారు.
ఫిబ్రవరి 3 నుండి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి. పాత విధానంలో ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంగ్లీష్‌లో ఉన్నట్లుగానే మిగతా భాషల్లోనూ ప్రాక్టీకల్స్ జరిపిస్తాం. అలాగే.. 12 ఏళ్ల తర్వాత ఇంటర్ సిలబస్‌లో మార్పులు జరగబోతున్నట్లు తెలిపారాయన. మ్యాథ్స్, ఫిజిక్స్ , కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సిలబస్ మారబోతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు.
NCERT ప్రకారం సబ్జెక్టు కమిటీ సూచనల ప్రకారం మార్పు చేస్తున్నామని అన్నారు. సిలబస్ మార్పులో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు భాగస్వాములవుతారు. నలభై ఐదు రోజుల్లో దీన్ని పూర్తి చేస్తాం. ఇంటర్ బోర్డు నిర్దేశించిన ప్రకారం డిసెంబరు 15 నాటికి సిలబస్ ను తెలుగు అకాడమీకి అందిస్తాం. కొత్త సిలబస్ తోపాటు క్యూఆర్ కోడ్ ప్రింటింగ్ కూడా ఉంటుంది.. ఏప్రిల్ ఎండింగ్ లో కొత్త సిలబస్ బుక్స్ అందుబాటులోకి తెస్తాం అని అన్నారు.
ల్యాబ్ ప్రాక్టికల్స్ ఇంగ్లీష్ తో పాటు ఇతర భాషల్లో కూడా ఉంటాయి. ల్యాబ్ ప్రాక్టికల్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా ఉంటాయి. కామర్స్ విద్యార్థుల కోసం స్పెషల్ కోర్సు రూపొందించినట్లు తెలిపారు. 2026 నుండి ACE గ్రూప్ ప్రారంభం అవుతుందని.. అకౌంటెన్సీ గ్రూపుకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
విద్యార్థుల్లో భాషా నైపున్యాలు పెంచేలా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కొత్త సిలబస్ 2026 నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. ఇంటర్ టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ నాలుగు నెలల్లోనే పూర్తి
మరోవైపు ఫిబ్రవరిలో జరిగే ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను గవర్నమెంట్ కాలేజీల్లోనే నిర్వహించేలా ప్రణాళికలు రెడే చేస్తోంది ఇంటర్మీడియెట్ బోర్డు. సర్కారు సెక్టార్ కాలేజీలను ప్రాక్టికల్ సెంటర్లను మినహాయించాలని డిసైడ్ అయింది. దీనికి అనుగుణంగా ఇంటర్ ప్రాక్టికల్స్ షెడ్యూల్‌ను రెడీ చేసింది. పారదర్శకతతో పాటు పిల్లల్లో పరీక్షల పట్ల భయాన్ని పొగొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ప్రతిఏటా సుమారు 4.20 లక్షలకు పైగా విద్యార్థులు అటెండ్ అవుతుంటారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో హాజరయ్యే అవకాశం ఉంది.
