V6 News

హైదరాబాద్ సిటీలో ఒక శాతం పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్ సిటీలో ఒక శాతం పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్​, వెలుగు: గత నెల హైదరాబాద్ లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు కొద్దిగా పెరిగాయి. మొత్తం 6,386 నివాస ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. వీటి విలువ రూ.4,637 కోట్లు. గత ఏడాది మార్చితో పోలిస్తే ఇవి ఒకశాతం పెరిగాయి. ఆదాయం పరంగా చూస్తే గత ఏడాదితో పోలిస్తే నాలుగు శాతం వృద్ధి నమోదైంది. 

రూ. కోటికి పైగా విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 20 శాతం మేర ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 46 శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి. మేడ్చల్– మల్కాజిగిరి 44 శాతంతో రెండో స్థానంలో ఉంది. జూబ్లీహిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో అత్యధిక ధరలకు ఇళ్లు అమ్ముడయ్యాయి.