తెలంగాణ జాబ్స్ స్పెషల్..కరెంట్​ ఎఫైర్స్​

తెలంగాణ జాబ్స్ స్పెషల్..కరెంట్​ ఎఫైర్స్​

స్పోర్ట్స్

ఆర్చరీ ప్రపంచకప్‌‌‌‌

ఆర్చరీ ప్రపంచకప్‌‌‌‌ స్టేజ్‌‌‌‌-3 టోర్నమెంట్లో అభిషేక్‌‌‌‌ వర్మ పురుషుల కాంపౌండ్‌‌‌‌ వ్యక్తిగత విభాగంలో గోల్డ్​ మెడల్​ సాధించాడు. ఫైనల్లో జేమ్స్‌‌‌‌ లూట్జ్‌‌‌‌ (అమెరికా)పై నెగ్గాడు. ప్రపంచకప్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌కు ఇది మూడో వ్యక్తిగత స్వర్ణం.'

ఇంటర్‌‌‌‌ కాంటినెంటల్‌‌‌‌ కప్‌‌‌‌

ఇంటర్‌‌‌‌ కాంటినెంటల్‌‌‌‌ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ కప్‌‌‌‌ను భారత్‌‌‌‌ సొంతం చేసుకుంది. ఫైనల్లో 2-–0 గోల్స్‌‌‌‌తో లెబనాన్‌‌‌‌ను ఓడించింది. కెప్టెన్‌‌‌‌ సునీల్‌‌‌‌ ఛెత్రి ఓ మెరుపు గోల్‌‌‌‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
 

నేషనల్ స్పార్క్‌‌‌‌ ర్యాంకుల్లో మెప్మా టాప్​

జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్‌‌‌‌ (ఎన్‌‌‌‌యూఎల్‌‌‌‌ఎమ్‌‌‌‌) ప్రకటించిన సిస్టమాటిక్‌‌‌‌ ప్రోగ్రెసివ్‌‌‌‌ అండ్‌‌‌‌ రియల్‌‌‌‌ టైం ర్యాంకింగ్‌‌‌‌ (స్పార్క్‌‌‌‌)లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జాతీయ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిచింది.


పశుగణం ఎగుమతుల ముసాయిదా బిల్లు  

జంతువుల ఎగుమతులను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా జూన్‌‌‌‌ 7న వెలువరించిన ‘పశుగణం, పశుగణ ఉత్పత్తుల (దిగుమతి, ఎగుమతి) ముసాయిదా బిల్లు’ను కేంద్రం తప్పనిసరి పరిస్థితిలో ఉపసంహరించుకుంది. 

మతమార్పిడి నిషేధ చట్టం రద్దు

మతమార్పిడి నిషేధ చట్టాన్ని రద్దు చేస్తామని కర్ణాటక కొత్త ప్రభుత్వం తీర్మానించింది. ఈ చట్టంతో పాటు పాఠ్య పుస్తకాల నుంచి సావర్కర్, హెడ్గేవార్‌‌‌‌ జీవిత చరిత్రను తొలగించాలని ప్రభుత్వం తీర్మానించింది.

స్పీడ్‌‌‌‌ చెస్‌‌‌‌ టైటిల్‌‌‌‌ విన్నర్​ గుకేశ్​

భారత యువ గ్రాండ్‌‌‌‌మాస్టర్‌‌‌‌ గుకేశ్‌‌‌‌ జూనియర్‌‌‌‌ స్పీడ్‌‌‌‌ చెస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో విజేతగా నిలిచాడు. తుది పోరులో 17 ఏళ్ల గుకేశ్‌‌‌‌ బలంగా పుంజుకుని టైటిల్‌‌‌‌ కైవసం చేసుకున్నాడు.

స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు

దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్లను రాష్ట్రంలోని 75 సరిహద్దు గ్రామాలకు పెట్టాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్‌‌‌‌ మహోత్సవ్‌‌‌‌’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది.
 

 

వ్యక్తులు

డాక్టర్‌‌‌‌ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల


కొవిడ్‌‌‌‌-19 మహమ్మారి నుంచి మానవాళికి రక్షణగా నిలిచిన కొవాగ్జిన్‌‌‌‌ టీకా ఆవిష్కర్తలైన భారత్‌‌‌‌ బయోటెక్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ కృష్ణ ఎల్ల, మేనేజింగ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ సుచిత్ర ఎల్ల దంపతులను జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రకటించింది.

జులన్‌‌‌‌ గోస్వామి

ప్రతిష్టాత్మక ఎంసీసీ ప్రపంచ క్రికెట్‌‌‌‌ కమిటీ (డబ్ల్యూసీసీ)లో భారత మహిళా క్రికెటర్‌‌‌‌ జులన్‌‌‌‌ గోస్వామికి చోటు దక్కింది. జులన్‌‌‌‌తో పాటు ఇంగ్లాండ్‌‌‌‌ మహిళల కెప్టెన్‌‌‌‌ హెదర్‌‌‌‌ నైట్, 2019 వన్డే ప్రపంచకప్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ జట్టు సారథి ఇయాన్‌‌‌‌ మోర్గాన్‌‌‌‌లకు ఎంసీసీ డబ్ల్యూసీసీలో స్థానం లభించింది.

ఆర్తి హోల్లా

భారత సంతతికి చెందిన బ్రిటన్‌‌‌‌ మహిళ శాటిలైట్ పరిశ్రమలో అత్యంత నిష్ణాతులైన ఆర్తి హోల్లా-మైనీని వియన్నాలోని ఐక్యరాజ్యసమితి (అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం) ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ డైరెక్టర్‌‌‌‌గా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ- జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఎంపిక చేశారు.

భవాని దేవి 

ఫెన్సర్‌‌‌‌ భవాని దేవి ఆసియా ఫెన్సింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో పతకం నెగ్గిన మొదటి భారత ఫెన్సర్‌‌‌‌గా నిలిచింది. చైనాలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల సాబెర్‌‌‌‌ విభాగంలో ఆమె కాంస్యం గెలిచింది. సెమీస్‌‌‌‌లో భవాని 14-–15 తేడాతో జేనబ్‌‌‌‌ దాయిబెకోవా (ఉజ్బెకిస్థాన్‌‌‌‌) చేతిలో పోరాడి ఓడింది. 

బేతవోలు రామబ్రహ్మం

కవి, పండితుడు, విమర్శకుడిగా పేరొందిన ప్రొఫెసర్​ బేతవోలు రామబ్రహ్మంకు ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌‌‌‌ పురస్కారం దక్కింది. కథలు, కవిత్వం, నాటకాలు కలిపి 34కు పైగా గ్రంథాలు రచించారు. సాహితీ వ్యాసాలు వెలువరించారు. 
 

తెలంగాణ కొత్త మండలంగా ‘బండలింగాపూర్‌‌‌‌’

జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌పల్లి మండలం నుంచి 10 గ్రామాలను వేరు చేసి బండలింగాపూర్‌‌‌‌ కేంద్రంగా కొత్త మండలాన్ని ప్రతిపాదిస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేసింది.

సింగరేణి థర్మల్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌కు పురస్కారం 

పర్యావరణహితంగా విద్యుదుత్పత్తి, గనుల తవ్వకం చేపడుతున్నందుకు సింగరేణి సంస్థకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. 
 

ఇంటర్నేషనల్

స్వలింగ వివాహం చట్టబద్ధమే

యూరప్‌‌‌‌లోని ఎస్టోనియా దేశం కీలక నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహానికి అనుమతినిచ్చేలా చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును చట్టసభ ఆమోదించింది. జనవరి 1 నుంచి ఎస్టోనియాలో స్వలింగ వివాహం అమల్లోకి రానుంది.

న్యూయార్క్‌‌‌‌లో దీపావళికి సెలవు 

న్యూయార్క్‌‌‌‌ నగరంలో పాఠశాలలకు ఈ ఏడాది నుంచి దీపావళి రోజున సెలవు ఇవ్వనున్నారు. రెండు దశాబ్దాలుగా దక్షిణాసియా, ఇండో-–కరీబియన్‌‌‌‌ ప్రజలు బిల్లు ఆమోదం కోసం పోరాడుతున్నారు. అసెంబ్లీ, సెనేట్​లో పాసైన ప్రస్తుత బిల్లు గవర్నర్‌‌‌‌ ఆమోదించాల్సి ఉంది.

వీసాదారులకు కెనడా గుడ్‌‌‌‌న్యూస్‌‌‌‌

అమెరికాలో పనిచేస్తున్నహెచ్‌‌‌‌-1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 10వేల మంది హెచ్‌‌‌‌-1బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఓపెన్‌‌‌‌ వర్క్‌‌‌‌-పర్మిట్‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌‌‌‌ మంత్రి సీన్‌‌‌‌ ఫ్రేజర్‌‌‌‌ వెల్లడించారు.

సైన్స్ అండ్ టెక్నా లజి కృత్రిమ వర్షం సక్సెస్​

ఐఐటీ కాన్పూర్‌‌‌‌కు చెందిన పరిశోధకులు క్లౌడ్‌‌‌‌ సీడింగ్‌‌‌‌ టెక్నాలజీని ఉపయోగించి ప్రయోగాత్మకంగా కృత్రిమ వర్షం  కురిపించారు. క్లౌడ్‌‌‌‌ సీడింగ్‌‌‌‌ టెక్నాలజీతో వాతావరణంలో రసాయనాలను చల్లారు. కొద్దిసేపటికి ఆ ప్రాంతంలో కృత్రిమ వర్షం కురిసింది.