ఫైర్ సేఫ్టీ అనుమతులకు ఏఐ టెక్నాలజీ

 ఫైర్ సేఫ్టీ అనుమతులకు ఏఐ టెక్నాలజీ
  • ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఆటోమెటిక్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌, లైఫ్‌‌‌‌ సేఫ్టీ ఆటో డ్రాయింగ్స్‌‌‌‌ స్క్రూట్నీ సిస్టమ్‌‌‌‌
  • ఫైర్‌‌‌‌‌‌‌‌ సర్విసెస్  కమాండ్‌‌‌‌ అండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌ ‌‌‌‌ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ఫైర్ సర్విసెస్‌‌‌‌లోకి మరో అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. బిల్డింగ్స్‌‌‌‌కు ఫైర్ సేఫ్టీ ఎన్‌‌‌‌ఓసీ ఇచ్చేందుకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఆటోమెటిక్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌, లైఫ్‌‌‌‌ సేఫ్టీ ఆటో డ్రాయింగ్స్‌‌‌‌ స్క్రూట్నీ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ను ఫైర్ సర్విసెస్‌‌‌‌తో అనుసంధానం చేశారు. బిల్డింగ్ నిర్మాణాల్లో ఫైర్ నిబంధనాలు, ఫైర్ డయాగ్రామ్‌‌‌‌ సహా ఇతర సేఫ్టీకి అవసరమైన ఎన్‌‌‌‌ఓసీ మంజూరు చేసేందుకు ఈ ఏఐ ఆధారిత సిస్టమ్‌‌‌‌ వినియోగించనున్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర ఫైర్‌‌‌‌‌‌‌‌ సర్విసెస్‌‌‌‌లో ఈ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ను సోమవారం ఆవిష్కరించారు.

 వట్టి నాగులపల్లిలోని  ఫైర్ సర్విసెస్‌‌‌‌ అకాడమీలో ఏర్పాటు చేసిన కమాండ్‌‌‌‌ అండ్‌‌‌‌  కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌, ఆటో డ్రాయింగ్‌‌‌‌ స్క్రూట్నీ సిస్టమ్‌‌‌‌ను సినీ నటుడు మురళీమోహన్‌‌‌‌తో కలిసి ఫైర్ సర్విసెస్‌‌‌‌ డీజీ నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా  నాగిరెడ్డి మాట్లాడుతూ.. బిల్డింగ్‌‌‌‌లకు  అనుమతులు ఇవ్వడం కోసం రూపొందించిన ఈ ఆటో డ్రాయింగ్‌‌‌‌ స్క్రూట్నీ సిస్టమ్‌‌‌‌ దేశంలోనే మొదటిది అన్నారు. ఆటో క్యాట్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా అనుమతులు ఇస్తామన్నారు. 

ఇరిగేషన్‌‌‌‌, మున్సిపల్‌‌‌‌ ఇతర డిపార్ట్‌‌‌‌మెంట్లలో అనుసంధానం చేసుకుని..ట్రాకింగ్‌‌‌‌, ప్రాసెసింగ్‌‌‌‌, అనుమతులు మంజూరు చేస్తామన్నారు. వారం రోజుల్లో లోపాలు చెక్ చేస్తామన్నారు. ఫైర్ సేఫ్టీ సిస్టం సరిగా ఉంటే రిపోర్ట్ అందుతుందని ఆ తరువాత అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో 101 నంబర్‌‌‌‌‌‌‌‌కి కాల్ వస్తే కమాండ్ అండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌కు బంజారాహిల్స్‌‌‌‌లోని మెయిన్‌‌‌‌ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు కనెక్ట్‌‌‌‌ అవుతుందన్నారు.