మొదటి ప్రాధాన్యతలో ఏవీఎన్ రెడ్డికి 7505 ఓట్లు

మొదటి ప్రాధాన్యతలో ఏవీఎన్ రెడ్డికి 7505 ఓట్లు

మహబూబ్ నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్  రెడ్డికి 7505 ఓట్లు రాగా, చెన్నకేశవ రెడ్డికి ఓట్లు 6584  వచ్చాయని ఈసీ అధికారులు వెల్లడించారు. మొదటి  ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డి 921 ఓట్ల మెజారిటీ ముందంజలో ఉన్నారు. 

ఏవీఎన్ రెడ్డి ఏ అభ్యర్థికి రానంత 50 శాతానికి పైగా మెజారిటీ వచ్చిందని అధికారులు తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 452 చెల్లని ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  ప్రస్తుతం అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. రెండో ప్రయారిటీ ఓట్ల లెక్కింపులో..  తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎన్నికల సిబ్బంది ఎలిమినేషన్ చేస్తూన్నారు.అభ్యర్థి మ్యాజిక్ ఫిగర్ 12709 ఓట్లు తెచ్చుకోవాలి.