హన్మకొండలో దీక్షాదివస్ ఫొటోలు చింపేసిన రహీమున్నిసా 

హన్మకొండలో దీక్షాదివస్ ఫొటోలు చింపేసిన రహీమున్నిసా 

హనుమకొండ : దీక్షాదివస్ లో భాగంగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన  ఫొటో ఎగ్జిబిషన్ వద్ద తెలంగాణ ఉద్యమకారిణి రహీమున్నిసా ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ ఘట్టాల ఫొటో గ్యాలరీలో తనది ఒక్క ఫొటో కూడా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.  తెలంగాణ సాధన ఉద్యమంలో తాను ప్రాణాలకు తెగించి పనిచేశానని, ఒక్క వినయ్ భాస్కర్ మాత్రమే ఉద్యమం చేశారా అని వ్యాఖ్యానించారు.

ఈక్రమంలో ఆగ్రహంతో ఆమె ఎగ్జిబిషన్లో ఏర్పాటుచేసిన పలు ఫొటోలను  చించివేశారు. అంతకుముందు ఇవాళ ఉదయం రాష్ట్ర  ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.