స్వాతంత్ర్య పోరాటం తరహాలోనే తెలంగాణ ఉద్యమం

స్వాతంత్ర్య పోరాటం తరహాలోనే తెలంగాణ ఉద్యమం

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో నిర్వహిస్తోన్న వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన  కార్యక్రమానికి ఆయన చీఫ్‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌గా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో స్వాతంత్ర సమర యోధులను స్మరించుకోనున్నట్లు చెప్పారు. మహనీయుల   త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. మారుతున్న పరిస్థితుల్లో  వారి స్ఫూర్తి  సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛ లేకపోతే మనకి ఎన్ని ఉన్నా తృప్తి ఉండదన్నారు. స్వాతంత్ర్య పోరాటం తరహాలోనే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం సాధనకు పల్లె ప్రగతి కార్యక్రమాలతో   సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు.  కేంద్రం ఎంపిక చేసిన ఆదర్శ గ్రామాల్లో పదికి పది తెలంగాణ రాష్ట్రానికి చెందిన పల్లెలే ఎంపికయ్యాయని, ఇందులో నిజామాబాద్ జిల్లా నుంచి 4 గ్రామాలు ఉండడం జిల్లాకు గర్వకారణం అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్లు సి.నారాయణరెడ్డి, జితేష్‌‌‌‌‌‌‌‌ వి పాటిల్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ పంద్రాగస్టు రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రజలను కోరారు. జిల్లా వ్యాప్తంగా 4.51 లక్షల కుటుంబాలకు జెండాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జడ్పీ చైర్మన్ విఠల్‌‌‌‌‌‌‌‌రావు, కామారెడ్డి జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ శోభ, రాజ్యసభ సభ్యుడు కె.ఆర్ సురేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీ బీబీ.పాటిల్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వి.గంగాధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్, విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంతు షిండే, సురేందర్, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ నగర మేయర్ నీతూకిరణ్, సీపీ కె.ఆర్ నాగరాజు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ ఆకుల లలిత, ఐడీసీఎంఎస్ చైర్మన్ మోహన్, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, చంద్రమోహన్, మున్సిపల్ చైర్ పర్సన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా స్థాయి ఆఫీసర్లు పాల్గొన్నారు.

బస్తీ దవాఖానా ప్రారంభం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దళిత వాడలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంగళవారం మంత్రి ప్రశాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రారంభించారు. పట్టణ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  

జాతీయ జెండాల పంపిణీ

బోధన్, వెలుగు: బోధన్​పట్టణం, మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు జాతీయ జెండాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ జెండాలు పంపిణీ చేశారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని సూచించారు.  

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ డీసీసీ భవన్‌‌‌‌‌‌‌‌లో...

నిజామాబాద్ టౌన్, వెలుగు:  క్విట్ ఇండియా డేను పురస్కరించుకుని మంగళవారం జిల్లా కాంగ్రెస్ భవన్‌‌‌‌‌‌‌‌లో జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా  ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ బ్రిటీష్ వారిని మన దేశం నుంచి తరిమేందుకు మహాత్మా గాంధీ క్విట్ ఇండియా పిలుపునిచ్చారని, 1942 ఆగస్టు 9 నుంచి పోరాడితే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చిందని గుర్తుచేశారు. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో పార్టీ అర్బన్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి తాహెర్, నగర అధ్యక్షుడు కేశ వేణు, మాజీ బీసీ సెల్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి రాంభూపాల్, కిసాన్ సెల్‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విక్కీ యాదవ్,  ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు.