
కరీంనగర్, వరంగల్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ శాటిలైట్ క్యాంపస్ లు ఏర్పాటు చేయాలని, డిగ్రీ, పీజీ కలిపి ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశపెట్టాలని ప్లానింగ్ బోర్డు వైఎస్ చైర్మన్ వినోద్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు లేఖ రాశారు. తమ ప్రభుత్వం వెయ్యి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసిందని, ఇందులో ఇంటర్మీడియెట్ వరకు చదువుతున్న స్టూడెంట్లకు నాణ్యమైన ఉన్నత విద్య కోసం సెంట్రల్ వర్శిటీ శాటిలైట్ క్యాంపస్ లు ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ లో తెలంగాణ స్టూడెంట్లకు 30శాతం సీట్లు కేటాయించాలని లేఖలో కోరారు.