కొలిక్కి వచ్చిన కిడ్నాప్ వ్యవహారం

కొలిక్కి వచ్చిన కిడ్నాప్ వ్యవహారం

న్యూఢిల్లీ: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో నలుగురు వ్యక్తుల కిడ్నాప్ కేసును ఢిల్లీ పోలీసులు చేధించారు. తెలంగాణ పోలీసులు వారిని తీసుకెళ్లినట్లు నిర్థారించారు. బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసం నుంచి సోమవారం రాత్రి నలుగురిని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. వారిని కిడ్నాప్ చేశారంటూ సౌత్ ఎవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ 365 కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో సైబరాబాద్ కమిషనరేట్ పరిథిలోని పేట్ బషీరాబాద్ పీఎస్ లో నమోదైన కేసులో ఆ నలుగురిని అదుపులో తీసుకున్నట్లు తెలంగాణ పోలీసులు ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. డ్రైవర్ థాపాను పొరపాటున అదుపులోకి తీసుకున్నామని, త్వరలోనే అతన్ని విడుదల చేస్తామని చెప్పారు. 

మంగళవారం సాయంత్రం ఢిల్లీ సౌత్ ఎవెన్యూ ప్లాట్ నెంబర్ 105లోని జితేందర్ రెడ్డి నివాసం వద్ద  కారు డ్రైవర్‎తోపాటు ముగ్గురు అతిథులను దుండగులు అపహరించారు. మహబూబ్ నగర్కు చెందిన ఉద్యమకారుడు మున్నూరు రవి, తన ఇద్దరు స్నేహితులతో కలిసి వ్యక్తిగత పనుల మీద కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి వచ్చి జితేందర్ రెడ్డి ఇంట్లో ఉంటున్నారు. నిన్న సాయంత్రం రవితో పాటు అతని స్నేహితులను గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ పుటేజీలో నమోదయ్యాయి. వాటి ఆధారంగా ఢిల్లీ సౌత్ ఎవెన్యూ పీఎస్‎లో జితేందర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు చేశారు.

For more news..

బెలార‌స్‌పై ఈయూ ఆంక్ష‌లు

రేపు యూపీలో ఆరో విడత పోలింగ్