హైదరాబాద్: టికెట్ల కేటాయింపుల వ్యవహారం ఇంకా ముగియలేదని ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టికెట్ల కేటాయింపులో ఏమైనా విభేదాలు ఉంటే.. పార్టీ అంతర్గత వేదికలపై మాత్రమే మాట్లాడాలి. పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారం ఇంకా ముగియలేదు.
ఏ నాయకుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా కానీ, నాయకులకు వ్యతిరేకంగా కానీ బహిరంగంగా మాట్లాడవద్దు. కొందరు నాయకులు ప్రెస్ మీట్స్ పెట్టి మాట్లాడుతున్నారు. ప్రకటనలు చేస్తున్నారు. అలా చేయడం పార్టీ విధానాలకు వ్యతిరేకం. కాంగ్రెస్పార్టీ లైన్ను ఎవరూ దాటొద్దు. ఎలాంటి సమస్యలున్నా పార్టీ దృష్టికి తీసుకురావాలి’ అని మన్సూర్కోరారు.
