తెలంగాణ ప్రజాసమితి..జాబ్స్ స్పెషల్​

తెలంగాణ ప్రజాసమితి..జాబ్స్ స్పెషల్​
  •     తెలంగాణ ప్రజా సమితి 1969, మార్చి 25న ఆవిర్భవించింది. 
  •     సిద్దిపేటకు చెందిన న్యాయవాది మదన్​ మోహన్​ తెలంగాణ ప్రజా సమితి మొదటి అధ్యక్షుడయ్యారు. తొలి కార్యదర్శి వెంకట్రామరెడ్డి. 
  •     తెలంగాణ ఉద్యమంలో తొలి బంద్​ సదాశివపేట కాల్పులకు నిరసనగా 1969, మార్చి 3న జరిగింది. 
  •     1969, మార్చి 8, 9వ తేదీల్లో తెలంగాణ సదస్సు రెడ్డి హాస్టల్​లో జరిగింది. ఈ సదస్సుకు సదాలక్ష్మి అధ్యక్షత వహించారు. 
  •     1969 మార్చి 11 నుంచి విద్యార్థుల నిరవధిక సమ్మె ప్రారంభమైంది.
  •     1969, మార్చి 17న ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాట దినం పాటించారు. 
  •     ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆంధ్రా నాయకుడు ఎన్​.జి.రంగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 
  •     తెలంగాణ రక్షణను అమలు చేయకపోతే సత్యాగ్రహం చేస్తామని మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి ప్రకటించారు. 
  •     నాన్​ ముల్కీలను ఉద్యోగాల నుంచి తొలగించాలని తెలంగాణ ఉపాధ్యాయ, ఉద్యోగులు సచివాలయం ముందు 1969, మార్చి 24న నిరాహార దీక్ష ప్రారంభించారు. 
  •     1969 మార్చి 27న ప్రత్యేక తెలంగాణ మాత్రమే ఏకైక లక్ష్యమని తెలంగాణ 
  • ప్రాంతీయ సంఘం మాజీ అధ్యక్షుడు అచ్యుత్​రెడ్డి ప్రకటించారు. 
  •     ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు జామై ఉస్మానియా రైల్వేస్టేషన్​పై 1969 మార్చి 28న దాడి చేసి నిప్పు పెట్టారు. 
  •     తెలంగాణకు మేఘాలయా లాగా ప్రాంతీయ ప్రతిపత్తిని కోరుతూ 1969 మార్చి 29న కొండా లక్ష్మణ్​ బాపూజీ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. 
  •     1969, మార్చి 30న ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్​ సమితిని కొండా లక్ష్మణ్​ బాపూజీ ఏర్పాటు చేశారు. 
  •     రక్తసిక్తమైన కమ్యూనిస్టు పార్టీ బహిరంగ సభ 1969, ఏప్రిల్​ 5న సికింద్రాబాద్​ అంజలీ టాకీసు చౌరస్తాలో జరిగింది. 
  •     తెలంగాణ ఉద్యమంలో మొదటిసారిగా ప్రివెంటివ్​ డిటెన్షన్​ (పీడీ) చట్టాన్ని 1969 ఏప్రిల్​ 6న అమలు చేశారు. 
  •     తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు మదన్​మోహన్​ను పీడీ చట్టం కింద అరెస్టు చేయడంతో ఆయన స్థానంలో అధ్యక్షునిగా ఎస్.బి.గిరిని నియమించారు. 
  •     ఎస్​.బి.గిరి తర్వాత తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షురాలిగా సదాలక్ష్మి ఎన్నికైంది.
  •     తెలంగాణ సమస్య పరిష్కారానికి 1969 ఏప్రిల్​ 11న ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ అష్టసూత్ర పథకం ప్రకటించారు. 
  •     తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ పోరాట దినం 1969, ఏప్రిల్​ 15న పాటించారు. 
  •     తెలంగాణలో ఉద్యోగుల నిరవధిక సమ్మె 1969, ఏప్రిల్​ 15న ప్రారంభమైంది. 
  •     ప్రత్యేక తెలంగాణను సమర్థిస్తూ మర్రి చెన్నారెడ్డి 1969, ఏప్రిల్​ 21 ఉద్యమంలోకి ప్రవేశించారు. 
  •     తెలంగాణ ప్రజా సమితి మే డేను డిమాండ్స్​ డేగా జరపాలని పిలుపు ఇచ్చింది. 
  •     1969, మే 1న హైదరాబాద్​లో జరిగిన ప్రదర్శనపై పోలీసు కాల్పుల్లో 20 మంది మరణించారు. 
  •     1969, మే 1న సికింద్రాబాద్​లో జరిపిన కాల్పుల్లో మరణించిన సాయం కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఎం.కె.ఉమేందర్​. 
  •     1969, మే 15న తన పదవికి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలికిన ప్రముఖ నాయకుడు కొండా వెంకటరంగారెడ్డి.
  •     హైదరాబాద్​ నగరంలో తెలంగాణ మృతవీరుల దినాన్ని 1969, మే 17న పాటించారు. 
  •     తెలంగాణ ప్రాంతంలో పెల్లుబికిన నిరసనలకు, అశాంతికి మౌలిక కారణాలను విశ్లేషించడానికి తెలంగాణలోని విశ్వవిద్యాలయ, కళాశాల అధ్యాపకులు 1969, మే 20న సదస్సు నిర్వహించారు. 
  •     1969, మే 20న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సుకు ప్రొఫెసర్​ మంజూర్​ ఆలం అధ్యక్షత వహించారు. 
  •     1969, మే 20న జరిగిన సదస్సులో సమర్పించిన పరిశోధనా పత్రాలన్నింటిని కలిపి తెలంగాణ మూవ్​మెంట్​ ఇన్​ ఇన్వెస్టిగేటివ్​ ఫోకస్​ అనే పేరుతో గ్రంథంగా ప్రచురించారు. 
  •     తెలంగాణ మూవ్​మెంట్​ ఇన్​ ఇన్వెస్టిగేటివ్​ ఫోకస్​లో ప్రొఫెసర్ జయశంకర్​ రాసిన 
  • కె.ఎల్​.రావు, నాగార్జున సాగర్​ వ్యాసంపై పార్లమెంటులో చర్చ జరిగింది. 
  •     తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షునిగా మర్రి చెన్నారెడ్డి 1969, మే 23న ఎన్నుకోబడ్డారు. 
  •     తెలంగాణ ప్రజాసమితికి మర్రి చెన్నారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి నిరసనగా ఏర్పడి పోటీ తెలంగాణ ప్రజా సమితికి శ్రీధర్​రెడ్డి అనే విద్యార్థి నాయకుడు అధ్యక్షుడు అయ్యారు. 
  •     1969, జూన్​ 1లోగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడకపోతే రక్తపాతం తప్పదు అని మే 24న హెచ్చరించిన తెలంగాణ ఎన్​జీవోల నాయకుడు కేఆర్​ ఆమోస్​. 
  •     తెలంగాణ మృతవీరుల స్మారక చిహ్నాన్ని నెలకొల్పాలని 1969, మే 31న నిర్ణయించిన ప్రజా సమితి నాయకుడు శ్రీధర్​రెడ్డి. 
  •     అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్​పార్క్​ పార్కులో మృతవీరుల స్మారక స్తూపాన్ని అంతర్జాతీయ ఖ్యాతి పొందిన తెలంగాణ కళాకారుడు ఎక్కా యాదగిరి రూపొందించారు. 
  •     1969, జూన్​ 2 నుంచి 4 రోజులపాటు కొనసాగిన అల్లర్లు, మారణకాండలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 30 మంది మరణించారు. 
  •     ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలికిన భారతీయ క్రాంతి దళ్​ అధ్యక్షుడు చౌదరి చరణ్​సింగ్​. 
  •     ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆకస్మికంగా 1969, జూన్​ 4న అర్ధరాత్రి హైదరాబాద్​కు వచ్చారు. 
  •     1969, జూన్​ 6న హైదరాబాద్​లో జరిగిన తెలంగాణ రచయితల సదస్సులో కాళోజీ నారాయణరావు అధ్యక్షతన కమిటీ ఏర్పడింది.