భారత అంతరిక్ష సంస్థకు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ISRO SAC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎలక్ట్రీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 13.
పోస్టుల సంఖ్య: 55.
పోస్టులు: ఫిట్టర్ 04, మెషినిస్ట్ 03, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 15, ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ 02, ఐటీ/ ఐసీటీఎస్ఎం/ ఐటీఈఎస్ఎం 15, ఎలక్ట్రీషియన్ 08, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ 07, ఫార్మాసిస్ట్ ఏ 01.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. ఫార్మాసిస్ట్–ఏ
పోస్టుకు మొదటి శ్రేణిలో ఫార్మసీలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 24.
లాస్ట్ డేట్: నవంబర్ 13.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్
రాత పరీక్షలో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 90 నిమిషాల్లో ఎగ్జామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.33 మార్కులు కోత విధిస్తారు. సిలబస్ కోసం dgt.gov.in/en/cts-details వెబ్సైట్లో సంప్రదించగలరు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
స్కిల్ టెస్ట్: ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. కేవలం రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది.
పూర్తి వివరాలకు isro.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
