ఎయిడ్స్  కంట్రోల్ లో తెలంగాణ నంబర్‌‌‌‌ 2..ఐదో స్థానం నుంచిరెండో ర్యాంకుకు జంప్

ఎయిడ్స్  కంట్రోల్ లో తెలంగాణ నంబర్‌‌‌‌ 2..ఐదో స్థానం నుంచిరెండో ర్యాంకుకు జంప్
  • నేషనల్ స్కోర్‌‌‌‌ కార్డులో73.9% మార్కులు
  • ఏఆర్‌‌‌‌టీ మందుల పంపిణీలోనూఅదరగొట్టిన రాష్ట్రం

హైదరాబాద్, వెలుగు: ఎయిడ్స్ నివారణలో తెలంగాణ ముందంజలో ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన త్రైమాసిక స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డులో దేశంలోనే 2వ ర్యాంకు సాధించింది. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(ఎన్ఏసీఓ) ఈ రిపోర్టును విడుదల చేసింది. మొత్తం 100 మార్కులకు తెలంగాణ 73.9 శాతం స్కోర్ సాధించింది. గతంలో రాష్ట్రం 5వ ర్యాంకులో ఉండేది. ఈసారి  పనితీరు మెరుగుపరుచుకుని ఏకంగా మూడు స్థానాలు పైకి ఎగబాకింది. బాధితులను గుర్తించడం, మందులు ఇవ్వడంలో నిర్దేశిత లక్ష్యాలను రాష్ట్రం అధిగమించింది.

15 జిల్లాలు ఆల్ రౌండ్ పర్ఫామెన్స్

కేంద్ర మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష (ఎంఏఎస్)డ్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డ్ లెక్కలను వెల్లడించింది. రాష్ట్రంలోని 15 జిల్లాలు మంచి పనితీరు కనబరిచాయి. అంతర్జాతీయ 95:95:95 లక్ష్యాలను ఈ జిల్లాలు నూరు శాతం పూర్తి చేశాయి. దీంతో ఇవి సురక్షిత్ లిస్టులో నిలిచాయి. జోగులాంబ గద్వాల, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి, హన్మకొండ, కరీంనగర్, మహబూబాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, జనగామ,  భూపాలపల్లి, వరంగల్ జిల్లాలు ఇందులో ఉన్నాయి. మరో 10 జిల్లాలు రెండు లక్ష్యాలను చేరి సక్షం కేటగిరీలో స్థానం దక్కించుకున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిరంతరం పనిచేయడంతోనే మంచి రిజల్ట్ వచ్చిందని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు. 

లక్ష్యానికి మించి గుర్తింపు

తెలంగాణలో బాధితుల గుర్తింపు భారీగా పెరిగింది. కేంద్రం ఇచ్చిన టార్గెట్ 1.50 లక్షలు కాగా.. రాష్ట్రంలో ఏకంగా 1,60,765 మందిని గుర్తించారు. దీంతో మొదటి లక్ష్యంలో 107 శాతం కవరేజీ నమోదైంది. వీరిలో 1,48,694 మంది రోగులకు క్రమం తప్పకుండా ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ మందులు అందుతున్నాయి. మందుల పంపిణీలో రాష్ట్రం 95 శాతానికి పైగా మార్కులతో గ్రీన్ కేటగిరీ సాధించింది. బ్లడ్ టెస్టులు చేయించుకున్న వారిలో 95.8 శాతం మందికి వైరస్ అదుపులోకి వచ్చింది.

మందులు మానేయకుండా నిఘా

కొత్తగా మందులు వాడుతున్న వారు మధ్యలో మానేయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. మందులు మానేసే వారి రేటు 2 శాతంలోపు ఉండాలి. రాష్ట్రంలో ఇది సరిగ్గా 2.0 శాతానికే పరిమితమైంది. దీంతో ఈ విభాగంలోనూ గ్రీన్ మార్క్ దక్కింది. హైరిస్క్ గ్రూపుల కవరేజీలో టార్గెట్ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ సాధించారు. ఏకంగా 260 శాతం కవరేజీ నమోదు చేశారు. టీఐ, ఓఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ సెంటర్లు ఏర్పాటు వంద శాతం పూర్తయింది. దిశా యూనిట్ల పర్యవేక్షణ కూడా నూరు శాతం అమలైంది. ఫండ్స్ యుటిలైజేషన్ సర్టిఫికేట్(యూసీ) గడువు కంటే ముందే కేంద్రానికి సమర్పించారు.