హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రైజింగ్ -2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సిటిజన్ సర్వేలో ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 3 లక్షలకు పైగా పౌరులు పాల్గొన్నారు. తమ విలువైన సూచనలు, సలహాలు అందజేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేండ్లు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలో ప్రజల నుంచి సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ సిటిజన్ సర్వే ప్రారంభించింది.
గత వారం ప్రారంభమైన ఈ సర్వే ఈ నెల 25న ముగియనుంది. ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in /telanganarising అనే వెబ్ సైట్ లో ప్రతిఒక్కరు తమ సలహాలు, సూచనలను అందించాల్సింగా ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది
